
●వైభవంగా సిడిమాను ఉత్సవం
రాయదుర్గం టౌన్: స్థానిక రససిద్ధుల కొండపై వెలసిన రససిద్ధేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ ఈశ్వర్ స్నేహబృందం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
రససిద్ధుల కొండపై అశేష భకుల మధ్య సిడిమానుకు బాలుణ్ని కట్టి తిప్పుతున్న దృశ్యం

●వైభవంగా సిడిమాను ఉత్సవం