
గిన్నిస్ బుక్‌లో రైల్వే ఉద్యోగికి చోటు
గుంతకల్లు: స్థానిక భాగ్యనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి సునీల్‌కుమార్‌కు గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. చైన్నెలో ఉద్యోగం చేస్తున్న ఆయన గత ఏడాది డిసెంబర్ 1న 1,090 మంది విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు గంట పాటు కీబోర్డు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథులుగా పాస్టర్ అనిల్‌కుమార్, అగస్టిన్ దండింగి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పత్రాన్ని ఆయన అందుకున్నారు.