
జిల్లాలో గత పది నెలల్లో మహిళలకు సంబంధించి నమోదైన కేసుల
అనంతపురం: ఆడపిల్లలకు భద్రత కరువైంది. బడిలో, బస్సులో ఇలా ఎక్కడ చూసినా పొంచి ఉన్న మృగాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బిడ్డ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఆమె తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ‘పచ్చ’ నేతలు కొందరు తామేమి చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో బాలికలు, మహిళలపై కూడా అకృత్యాలకు దిగుతున్నారు. ఇటీవల బొమ్మనహాళ్ మండలంలో ఓ ‘పచ్చ’ నేత బాలికను మానసికంగా, శారీరకంగా హింసించడమే ఇందుకు నిదర్శనం.
చట్టమున్నా భయమేదీ..?
బాలికలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తారని తెలిసినా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. గత పది నెలల కాలంలోనే 12 పోక్సో కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు లేదా 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే పరిస్థితి ఉన్నా లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. నేటి ‘స్మార్ట్’ యుగంలో చిన్న పిల్లలకు సైతం స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండటం చేటు తెస్తోందని సైకాలజిస్టులు, విద్యావేత్తలు చెబుతున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారో వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలంటున్నారు.
18
మహిళలపై హింస
45
అత్యాచారం
12
చిన్నారులపై లైంగిక దాడులు
2
వరకట్న వేధింపులు
06
మిస్సింగ్, కిడ్నాపింగ్
మైనర్లపై పెరుగుతున్న అకృత్యాలు
గత పది నెలల్లోనే 12 పోక్సో కేసులు
బయటికెళ్లిన ఆడబిడ్డ ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఆందోళన