
‘కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి’
గుంతకల్లు: కార్మిక వ్యతిరేక విధానాలకు రైల్వే యాజమాన్యం స్వస్తి పలకాలని రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. యాజమాన్యం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య పిలుపు మేరకు స్థానిక రైల్వేస్టేషన్‌లోని క్రూ లాబీ వద్ద ఎల్‌ఆర్‌ఎస్, ఓపీటీజీ బ్రాంచ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. లోకో రన్నింగ్ సిబ్బందికి వ్యతిరేకంగా మల్టీడిసిప్లనరీ కమిటీ వ్యవహరిస్తోందన్నారు. హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పని చేసే రన్నింగ్ సిబ్బందికి స్పెషల్ అలెవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వడ్డెర విద్యార్థులకు
ప్రతిభా పురస్కారాలు
అనంతపురం రూరల్: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు వడ్డెర సేవా సంఘం జిల్లా అద్యక్షుడు వడ్డె లక్ష్మీనారాయణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు మే 25వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలి. పూర్తి వివరాలకు 94411 09916, 98662 36626, 99087 45966, 99492 29870లో సంప్రదించవచ్చు.