
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు. 14 స్పెషాలిటీల్లో 319 పోస్టులను నోటిఫై చేయగా 316 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఇందులో 112 పోస్టులు శాశ్వత, 50 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. వీటిలో జనరల్ మెడిసిన్ 28, జనరల్ సర్జరీ 27, గైనకాలజీ 33, అనస్తీషియా 22, పాథాలజీ 12, పీడియాట్రిక్స్ 12, మిగిలిన స్పెషాలిటీల్లో ఇతర పోస్టులు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment