
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 282 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 88,0712కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. (చదవండి: కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’)
గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా కడపలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7092కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 442 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 86,9920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,15,74,117 శాంపిల్స్‌ను పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment