అంతరిస్తున్న అతిథి పక్షులు | 29 bird species are identified as endangered | Sakshi
Sakshi News home page

అంతరిస్తున్న అతిథి పక్షులు

Published Fri, Jan 13 2023 4:27 AM | Last Updated on Fri, Jan 13 2023 8:43 AM

29 bird species are identified as endangered - Sakshi

కొల్లేరులో పక్షులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలస పక్షులకు ముప్పు వచ్చి పడుతోంది. విదేశాల నుంచి కొల్లేరు వలస వచ్చే వైట్‌ బ్యాక్ట్‌ రాబందు, సైబీరియన్‌ క్రేన్, బెంగాల్‌ ఫ్లోరికన్‌ వంటి పక్షి జాతులు కనిపించడం లేదు. పెరుగుతున్న జనాభా.. తరుగుతున్న అడవులు.. మిరుమిట్లు గొలిపే కాంతులు.. ఆహార కొరత పక్షుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు, మానవ తప్పిదాల కారణంగా అరుదైన పక్షి జాతులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.


వైట్‌ బ్యాక్డ్‌ రాబందు

విదేశాల నుంచి మన దేశానికి వచ్చే 29 పక్షి జాతులు ప్రమాదం అంచున ఉన్నట్టు పక్షి ప్రేమికుల పరిశీలనలో వెల్లడైంది. ఇప్పటికే 15 జాతుల పక్షులు అంతరించే జాబితాలో చేరాయని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) రెడ్‌ లిస్ట్‌ ద్వారా ప్రకటించింది. రాష్ట్రంలోని కొల్లేరు ప్రాంతానికి ఏటా దాదాపు 6 లక్షల పక్షులు వస్తుంటాయి. వీటిలో అనేక జాతులు ప్రమాదం అంచున ఉన్నాయని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 


సైబీరియన్‌ క్రేన్‌

గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌.. సైబీరియన్‌ క్రేన్‌ కనిపించట్లేదు 
ఐయూసీఎన్‌ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఐత్య బేరీ, అటవీ గుడ్ల గూబ, గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్, బెంగాల్‌ ఫ్లోరికన్, సైబీరియన్‌ క్రేన్, స్నేహశీల లాఫ్టింగ్, వైట్‌ బ్యాక్ట్‌ రాబందు, రెడ్‌హెడ్‌ రాబందు, సన్న రాబందు, ఇండియన్‌ రాబందు, పింక్‌హెడ్‌ బాతు, హిమాలయ పిట్టను పూర్తిగా కనుమరుగవుతున్న జాబితాలో చేర్చారు. కలివికోడి జాడ కోసం కోసం పక్షి ప్రేమికులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ గాలిస్తున్నారు.  


అరుదైన కలివికోడి

కనుమరుగవడానికి కారణాలెన్నో... 
జీవరాశులన్నీ ఆహారపు గొలుసులో భాగంగా ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పూర్వం పశు కబేళాలను పీక్కు తినడానికి రాబందులు వచ్చేవి. వాటికి ఇప్పుడు ఆహార కొరత ఏర్పడింది. ఇటీవల ఆకాశ హరŠామ్యలలో అద్దాల గోడల వెనుక వెలిగే దీపాలను ఢీకొని అనేక పక్షులు మృత్యువాత పడుతున్నట్టు గుర్తించారు. ఎరువులు, పురుగు మందుల వాడకం, అయస్కాంత తరంగాలు, కరెంటు తీగలు, అడవుల్లో చెట్లు నరకడం, ధ్వని తరంగాలు, వేటగాళ్లు, వాయు, నీటి, భూమి కాలుష్యం పక్షి జాతుల అంతానికి కారణంగా మారుతున్నాయి.


బెంగాల్‌ ఫ్లోరికన్‌ పక్షి

ఆవాసాలు కోల్పోతున్నాయి 
పక్షులు తమ ఆవాసాలను కో­ల్పోతున్నాయి. ఇవి అక్షాం­శాలు, రేఖాంశాల మధ్య సముద్ర తీరంలో ప్రయాణిస్తాయి. రసాయనాల వినియోగం పెరగడంతో వాటిని తిని పక్షులు మరణిస్తున్నాయి. పక్షులకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలి. చెరువుల విస్తీర్ణం తగ్గడంతో వీటి మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. పక్షులను రక్షించుకోవడం అందరి బాధ్యత. 
– డాక్టర్‌ వి.సంధ్య, జువాలజీ లెక్చరర్, కైకలూరు


కొల్లేరులో పక్షులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement