
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో కరోనాకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. థర్డ్ వేవ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీడియాట్రిక్ విభాగంలో మౌలిక వసతులు ఏర్పా టు.. చిన్న పిల్లల వైద్యులను నియమించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లుచేయాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన మంత్రులతో కూడిన కమిటీ ఏపీఐఐసీ భవనంలో మంగళవారం సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆరోగ్య శాఖ అధి కారులు ఇందులో పాల్గొన్నారు.
జనావాసాలకు దగ్గర్లో హెల్త్ హబ్‌లు
ఏరియా ఆస్పత్రి మొదలుకుని బోధనాçస్పత్రి వరకూ చిన్నారులకు వైద్యమందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచిం చారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కిందనే వైద్యం అందేలా చూడాలని, జనావాసాలకు సమీపంలో హెల్త్ హబ్‌లను ఏర్పాటుచేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు ఇబ్బంది పడకుండా వ్యాక్సిన్ వేసే ముందురోజే వారికి టోకెన్‌లు జారీచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment