ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో అమెరికా కంపెనీలదే హవా  | American companies are leading in private job creation | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో అమెరికా కంపెనీలదే హవా 

Published Fri, May 12 2023 5:45 AM | Last Updated on Fri, May 12 2023 5:45 AM

American companies are leading in private job creation - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలలో అమెరికా  కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్‌–10 కంపెనీల్లో 5 అమెరికా కంపెనీలే ఉన్నాయి.  అమెరికా రిటైల్‌ స్టోర్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్, అమెజాన్, యునైటెడ్‌ పార్సిల్‌ సర్వీసెస్, కొరేగర్, హోమ్‌ డిపో సంçస్థలు అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా టాప్‌–10లో చోటు దక్కించుకున్నాయి.

వాల్‌మార్ట్‌ కంపెనీ ఒకటే ఏకంగా 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మొదటి స్థానంలో ఉన్నట్టు వరల్డ్‌ స్టాటస్టిక్స్‌ ఓఆర్‌జీ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. 15.41 లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌ రెండో స్థానంలో, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌ కాన్‌ 8,26,608 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా మూడో స్థానంలో నిలిచాయి. - సాక్షి , అమరావతి 

6వ స్థానంలో టీసీఎస్‌
టాప్‌–10లో ఇండియాకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఒక్కటే చోటు దక్కించుకుంది. టీసీఎస్‌ 6,16,171 మందికి ఉపాధి కల్పించడం ద్వారా 6వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తూ టాప్‌–100లో చోటు దక్కించుకున్న మరో మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి.

ఇన్ఫోసిస్‌ 3,46,845 ఉద్యోగాల కల్పనతో 34వ స్థానంలో నిలవగా.. 2.60 లక్షల ఉద్యోగాల కల్పనతో మహీంద్రా 61వ స్థానం, 2.36 లక్షల ఉద్యోగాలిచ్చి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 74వ స్థానంలో నిలిచాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement