
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే రూ.1,121 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.372 కోట్లను ఈ నెల 4న విడుదల చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ తెలిపారు. ఈ మొత్తాలను ఆయా గ్రామ పంచాయతీలకు జమ చేశామన్నారు. గతంలో చెల్లించిన రూ.1,121 కోట్లలో రూ.1,061 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని, పలు కారణాలతో రూ.60 కోట్లు పంచాయతీల ఖాతాల్లో ఉన్నాయని తెలిపారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment