
సాక్షి, తాడేపల్లి: అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. గండికోట ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారన్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లలో చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద రిలీజ్ చేసింది ఎంత. చంద్రబాబు గండికోటకు ఈ ప్యాకేజ్ కింద నిధులు విడుదల చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్లనే 26 టీఎంసీల నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గండికోటకు 972 కోట్ల రూపాయలు ప్రకటించారు. వాటిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 676 కోట్లు విడుదల చేశారు. మిగతా 296 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేస్తాము. గండికోట గురించి మాట్లాడడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు కొంతమందిని రెచ్చగొడుతున్నారు’ అని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: మహిళలకు మరో ‘రత్నం’)
ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన తిప్పి కొడతాము. రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రవేశ పెడుతున్నారు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని త్వరలో పూర్తి చేస్తాము. పల్నాడులో 1500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నాము. కృష్ణ నది ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నాము. వర్షాలు పడకూడదని దేవుడుని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాయలసీమకు సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి పని చేస్తుంటే ఆయన ఓర్వలేకపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు పుష్కలంగా పడ్డాయి. 81 శాతం రిజార్వయర్లు నిండాయి. చంద్రబాబు విజయవాడకు చుట్టపు చూపుగా వస్తున్నారు. ఆరు నెలల్లో చంద్రబాబు పట్టుమని పది రోజులు కూడా అమరావతిలో ఉండలేదు. 2 లక్షల 70 కోట్ల అప్పు చేసింది చంద్రబాబు నాయుడు.70 వేల బిల్లులు పెండింగ్ లో చంద్రబాబు పెట్టారు. చంద్రబాబు పెట్టిన బకాయిలు మేము చెల్లిస్తున్నాము’ అని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment