
నెల్లూరు: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మందికి 6, 440 కోట్లు రెండో విడత వైఎస్సార్ ఆసరా ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రెండు విడతల్లో కలిపి 12,700 కోట్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లోకి వేశారని అనిల్ కుమార్ తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన. మహిళా సాధికారత కోసం పధకాలు తీసుకొచ్చారు’ అని తెలిపారు.
‘సున్నా వడ్డీ ని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ఆ అప్పు 3000 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తోంది. టీడీపీ హయాం లో మహిళలకు ఒక్క ఇల్లుకూడా ఉచితంగా ఇవ్వలేదు. టిడ్కో ఇళ్ల పేరుతో ఋణభారం మోపాలని చూశారు. సీఎం వైఎస్ జగన్ టిడ్కో ఇళ్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు. 4 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. హైదరాబాద్ లో ఉంటూ అప్పుడుడప్పుడూ వచ్చి చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. ఇక్కడ చదవండి: ఏపీలోనే పేదల ఇళ్ల నిర్మాణం విస్తీర్ణం ఎక్కువ
Comments
Please login to add a commentAdd a comment