
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఆరు నెలలు సీఎస్ నీరబ్‌కుమార్ సర్వీస్‌ను పొడగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు.
సీఎం చంద్రబాబు అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని కేంద్రం సీఎస్ నీరబ్ పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిపింది. సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు నీరబ్‌కుమార్ సీఎస్‌గా కొనసాగనున్నారు.