సాక్షి, గుంటూరు: అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందాన్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో వాళ్లు పాల్గొని వచ్చారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వాళ్లతో ముచ్చటించారు. వాళ్ల టూర్ అనుభవాల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు బాగోగులు మాట్లాడారు.
అమెరికా పర్యటన ద్వారా మీకు గ్లోబల్ ఫ్లాట్‌ఫాంమీద కొన్ని అనుభవాలు నేర్చుకున్నారు. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎలా నిలబడాలి అన్నదానిమీద మీకు కొన్ని అనుభవాలు ఈపర్యటన ద్వారా వచ్చి ఉంటాయని భావిస్తున్నాను. ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారుతాయి. దీనికి విద్యే ఆధారం అని వాళ్లతో అన్నారాయన. అంతేకాదు.. విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద మీకు సీటు వస్తే చాలు రూ.1.2 కోట్ల వరకూ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయాన్ని సీఎం జగన్ విద్యార్థుల వద్ద ప్రస్తావించారు.
‘‘కాలేజీల్లో విద్యాభ్యాసం తర్వాత మీరు బయటకు వచ్చాక మీలో ఒక విద్యార్థి.. ఆశించినట్టుగా సీఈవోగా ఎదుగుతారు. టెన్త్‌నుంచి ట్రిపుల్ ఐటీ సీటు రావడం అన్నది మీ డ్రీం. అది నిజం అయ్యింది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి కొలంబియా లాంటి యూనివర్శిటీ లాంటి గొప్ప యూనివర్శిటీల్లో సీటు సాధించడం.. తర్వాయి డ్రీమ్ కావాలి అని ఆకాంక్షించారు సీఎం జగన్.
‘‘బయట ప్రపంచం చూసినప్పుడు మరింతగా కష్టపడాలన్న స్పూర్తి మీలో కలుగుతుంది. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment