
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్ కు 2400 రూపాయలు ఉన్న ధరను 1600 రూపాయలకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్‌గా ల్యాబ్స్ లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన 2900 రూపాయల ధరను 1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో కిట్లు ధర తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment