
న్యూఢిల్లీ : మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని పిటిషన్‌లో కోరింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ‘ధోరణి మారకపోతే ప్రజలే తరిమికొడతారు
ఎఫ్ఐఆర్‌ను రిపోర్ట్ చేయవద్దని మీడియాపై నిషేధం విధించారని, ఎఫ్ఐఆర్పై పిటిషనర్ ప్రశ్నించనప్పటికీ వాటిపై సైతం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. కోర్టును ఆశ్రయించని వారికి సైతం రిలీఫ్ ఇచ్చారని, అమరావతిలో భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం జరిగిందని పేర్కొంది. కీలక పదవిలో ఉన్న వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment