
సాక్షి, అమరావతి : ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్‌కు ఆంధప్రదేశ్ ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుదని తెలిపారు. 26న మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు బంద్ ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment