సాక్షి, అమరావతి: కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ది చేసి దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. శనివారం దేశవ్యాప్తంగానూ, ఆంధ్రప్రదేశ్ లోనూ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించటం శుభపరిణామమన్నారు. చదవండి: ఏపీ వ్యాప్తంగా రెండో రోజు వ్యాక్సినేషన్..
పరిశోధకులు తమ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గవర్నర్ ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్య కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్ అభినందించారు. చదవండి: మరోసారి మారిన కరోనా కాలర్ టోన్
Comments
Please login to add a commentAdd a comment