
ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలకు ఊరట లభించింది.
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలకు ఊరట లభించింది. తమపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ, వైఎస్సార్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అప్పటివరకు ఎలాంటిచర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది.