
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలో తమ విద్యా సంస్థలకు చెందిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. శనివారం రాత్రి అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి సోమవారం ఉదయం వరకు తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు.