
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్పు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు అధికారులు ప్రకటించారు.