సాక్షి, పశ్చిమగోదావరి: గుండెపోటుతో కన్నుమూసిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు అంత్యక్రియలు ముగిసాయి. పాతపాటి స్వగ్రామం జక్కరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
పాతపాటి సర్రాజుకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సర్రాజు తుదిశ్వాస విడిచారు.
కాగా, 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో ఆయన జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు.
17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు.
చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం
Comments
Please login to add a commentAdd a comment