సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయని, ఏపీ వైద్యారోగ్య రంగానికి ఇది స్వర్ణయుగమని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో సీఎం జగన్ చొరవతో 17 మెడికల్ కళాశాలు ఏర్పాటయ్యాయి. రాజమండ్రిలో మెడికల్ కళాశాల పనులను ఇవాళ పరిశీలించా. రాష్ట్రంలో ఐదు కాలేజీలను ప్రయారిటీ కాలేజీలుగా గుర్తించాం. రూ. 475 కోట్లతో రాజమండ్రిలో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోంది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే.. విజయనగరం, మచిలీపట్నం ఏలూరు, నంద్యాల రాజమండ్రి వైద్య కళాశాలలకు సంబంధించి మెడికల్ ఇన్స్పెక్షన్స్ కూడా పూర్తయ్యాయ’’ని తెలిపారామె.
మంత్రి రజిని కామెంట్స్..
► ఈ అకడమిక్ ఇయర్ లో అడ్మిషన్స్ ప్రారంభిస్తాము. జగనన్న కాలంలో వైద్యారోగానికి స్వర్ణయగం అని చెప్పొచ్చు. ప్రస్తుతం 350 పడకల ఆసుపత్రి నడుస్తోంది. ఇంకా వీటిని పెంచుతాము. మరింత మెరుగైన సదుపాయాలు అందిస్తాం
► చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారామె. చంద్రబాబు టెంపరరీ ఆలోచన చేస్తాడు. జగనన్న దీర్ఘకాల ఆలోచనతో ఈ కళాశాలల నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు టీడీపీ నేతలు వైద్య ఆరోగ్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. టిడిపి హయాంలో చెప్పుకోదగిన నిర్మాణం ఒకటి కూడా లేదు. మీకు దమ్ముంటే ఏం చేశారో మీరు చెప్పాలి
► మహిళల విషయంలో చింతమనేనికి ఎంత సంస్కారం ఉందో వనజాక్షి ఘటనను చూస్తే తెలుస్తుంది.
► ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల విషయం మా నోటీసులో ఉంది. బడ్జెట్ విడుదల చేస్తున్నాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్య రానియ్యమూ. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ఆరు నెలలు ట్రైల్స్ చేసాము విజయవంతంగా అమలవుతోందని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దేశంలోనే మేటి.. కర్నూల్ సీడ్
Comments
Please login to add a commentAdd a comment