
పెద్దింటి రాంబాబు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: శ్రీ విశాఖ శారద పీఠంపై గోవిందానంద స్వామి అనుచిత వ్యాఖ్యలు తాము ఖండిస్తున్నట్లు ఏపీ అర్చక సమాఖ్య నేతలు ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు పేర్కొన్నారు. ఆయన తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హనుమ జన్మస్థలంపై టీటీడీ నిర్ణయం సముచితమన్నారు. భారతీయ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శ్రీ విశాఖ శారద పీఠంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ అన్నారు.