వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు క్రైం) ప్రేమ, ఆప్యాయత, అనుబంధం..మనుషుల్లోనే కాదు.. తమలోనూ ఉంటాయని నిరూపించిందో పిల్ల వానరం. తన యజమానికి దెబ్బ తగిలితే ఒక పిల్ల కోతి తల్లడిల్లిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రొద్దుటూరులోని పక్కీరప్ప ఒక పిల్ల వానరాన్ని పెంచుకుంటున్నాడు. అతను బయటికి ఎక్కడికి వెళ్లినా దానిని వెంట తీసుకొని వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన గొడవలో పక్కీరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. అతనితో పాటు కోతిని కూడా 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రక్తగాయాలతో ఉన్న పక్కీరప్పను చూసి పిల్ల వానరం తల్లడిల్లి పోయింది. పడుకొని ఉన్న యజమాని పక్కనే కూర్చుంది. అతన్ని లేపడానికి పదే పదే ప్రయతి్నంచింది. వానరం, యజమాని బంధం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. మరో వైపు స్థానికులు పిల్లకోతికి ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment