సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్19, 2021 నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి కాలపరిమితి మార్చి29, 2027వరకు ఉండడంతో ఆ కాలపరిమితికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి కె.విజయానంద్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
శాసన సభ్యుల కోటాలో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియను మార్చి 28లోగా ముగించాలని తెలిపింది. మార్చి 14 నుంచి నామినేషన్ల స్వీకరణ, మార్చి 15న నామినేషన్ల పరిశీలన, మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, అవసరమైతే మార్చి 24న ఎన్నిక జరుగుతుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఏపీ శాసనసభ ఉపకార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి, సహాయరిటర్నింగ్ ఆఫీసర్‌గా ఏపీ శాసనసభ ఉపకార్యదర్శి ఆర్.వనితారాణిని నియమిస్తూ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్
Published Tue, Mar 8 2022 3:50 AM | Last Updated on Tue, Mar 8 2022 9:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment