
వైఎస్సార్ హయాంలో రాయలసీమకు మేలు జరిగిందని రాయలసీమ కార్మిక, కర్షక పరిషత్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు మేలు చేశారన్నారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ హయాంలో రాయలసీమకు మేలు జరిగిందని రాయలసీమ కార్మిక, కర్షక పరిషత్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు మేలు చేశారన్నారు. చంద్రబాబుకు, రాయలసీమ టీడీపీ నేతలకు నీటి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు.
మైసూరారెడ్డి విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ప్రయోజనాల కోసం కృషిచేస్తున్నారన్నారు. రాయలసీమలోని మేధావులు, రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని చంద్రశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.