LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates
7:07 PM, సెప్టెంబర్ 29, 2023
కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో
► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు
ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ :
► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది.
► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు.
► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం.
► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు
► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ.
► కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది.
► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు.
► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది.
► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం.
► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం.
► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు.
► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను.
7:02 PM, సెప్టెంబర్ 29, 2023
లోకేష్ ఎక్కడ.?
► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్
► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం
► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్‌లో రూమ్ ఖాళీ
► మీటింగ్‌లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్‌లో లేడు
► రెగ్యులర్‌గా వాడే కారు మార్చేశాడు
► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు
6:32 PM, సెప్టెంబర్ 29, 2023
అభివృద్ధి తరలిపోతోందన్న బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?
► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు
1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా?
2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్‌కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ?
3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు?
4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు?
6:23 PM, సెప్టెంబర్ 29, 2023
పళ్లాలను గరిటలతో కొట్టండి : బ్రాహ్మణి
► చంద్రబాబు అరెస్ట్ అయినందుకు నిరసన తెలపాలంటూ పిలుపు
► బ్రాహ్మణి తీరును తప్పుబట్టిన మంత్రి అంబటి
► నాడు పళ్లాలను గరిటలతో కొట్టిన కాపులను దెబ్బతీశారు, ఇప్పుడు విధి ప్రకారం మీ వంతొచ్చిందంటూ చురకలు
విధి విచిత్రమైనది !
— Ambati Rambabu (@AmbatiRambabu) September 29, 2023
కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని
మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ !
అవినీతి కేసులో బొక్కలో పడి
పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ !@ncbn@naralokesh @iTDP_Official
5:23 PM, సెప్టెంబర్ 29, 2023
భువనేశ్వరీకి నోటీసులు ఇవ్వాలి : కోర్టును కోరిన లూథ్రా
► రింగ్ రోడ్ అక్రమ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూద్రా వాదనలు
► భువనేశ్వరి అకౌంట్ నుంచే లింగమనేనికి అద్దె చెల్లింపులు జరిగాయి
► చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని కోరిన లూథ్రా
► బాబు బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి లింకు పెట్టొద్దు లూథ్రా
5:20 PM, సెప్టెంబర్ 29, 2023
లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారంటే.? : అచ్చెన్నాయుడు
► ఎన్నికేసులు వేసినా లోకేష్ భయపడడు
► సుప్రీంకోర్టు లాయర్లకు బ్రీఫింగ్ ఇవ్వడానికే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడు
► లాయర్లతో చర్చించాలి కాబట్టే లోకేష్ పాదయాత్ర వాయిదా
5:00 PM, సెప్టెంబర్ 29, 2023
తప్పులు చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లారు : రఘువీరారెడ్డి
► శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు అరెస్ట్‌పై సీనియర్ నేత N.రఘువీరారెడ్డి వ్యాఖ్యలు
► స్వీయ తప్పిదాల వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారు
► తాను తవ్విన గోతిలో తనే పడ్డారు చంద్రబాబు
► ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో సభ నిర్వహిస్తే చెప్పులు, రాళ్లు వేయించారు
► టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చంద్రబాబు విడుదల కాలేరు
► న్యాయస్థానంలో తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి
4:25 PM, సెప్టెంబర్ 29, 2023
హైకోర్టు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు అక్టోబర్ 3కు వాయిదా
► చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ వచ్చే నెల 3కు వాయిదా
► CID తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు
► రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు
► లింగమనేని భూముల పక్కనుంచి వెళ్లేలా అలైన్‌మెంట్ మార్పులు
► అలైన్‌మెంట్ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగింది
► లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఅక్రమాలకు పాల్పడ్డాయి
► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు
3:25 PM, సెప్టెంబర్ 29, 2023
స్టేబిఎన్ ఇన్నాళ్లకు జైలుకెళ్లాడు : బొత్స
► విజయనగరంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టిడిపి నేతలు కలిసి దోచుకుతిన్నారు
► ఇప్పడు సెక్షన్లు వర్తించవని అంటున్నారు తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదు
► చంద్రబాబు ఇప్పటివరకు స్టే లు తెచ్చుకొని బ్రతికాడు
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కూడా అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు
► జైలుకు వెళ్లిన తర్వాత సానుభూతి పొందాలని చూస్తున్నాడు
► శాసనసభలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలు చర్చించకుండా పారిపోయారు
► అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలకి కూడా తెలుసు
3:15 PM, సెప్టెంబర్ 29, 2023
తెలుగుసేనలో అయోమయం
► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు
► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు
► రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి
► రాజమండ్రి లోకేష్ క్యాంప్‌లో నారా బ్రాహ్మణి
► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ
► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్
3:10PM, సెప్టెంబర్ 29, 2023
హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు, లోకేష్ పిటిషన్లు వాయిదా
► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
► కేసు విచారణను అక్టోబర్ 4, 2023, బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు
► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా అక్టోబర్ 4కు వాయిదా వేసిన హైకోర్టు
3:00PM, సెప్టెంబర్ 29, 2023
హైకోర్టు : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో 4వరకు ఆగండి
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో లోకేష్ వేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ
► లోకేష్‌ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన
► ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు
2:50PM, సెప్టెంబర్ 29, 2023
హైకోర్టు : అమరావతి రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసు
► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు
► CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు
2:40PM, సెప్టెంబర్ 29, 2023
లోకేష్ లోకేషన్ ఎక్కడ?
► ఢిల్లీ: మీడియాకు కంటపడకుండా తిరుగుతున్న లోకేష్
► కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు
► నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్
► ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్పు
► జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఉన్నారని సమాచారం
► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో మంతనాలు
► CID బృందం వస్తుందని తెలిసి ఢిల్లీలో అలర్ట్
2:30PM, సెప్టెంబర్ 29, 2023
►లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
►స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుల్లో లోకేష్ బెయిల్ పిటిషన్
2:15 PM, సెప్టెంబర్ 29, 2023
హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
► హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బాబు లాయర్లు
► ఫైబర్ నెట్ స్కాంలో A25గా ఉన్న చంద్రబాబు
► A25గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సిఐడి మెమో
► తాజా పరిణామాలతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
► అత్యవసరంగా విచారించాలని ఇప్పటికే హైకోర్టును కోరిన లోకేష్ లాయర్లు
► కాసేపట్లో హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం
2:00 PM, సెప్టెంబర్ 29, 2023
ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.?
1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు.
2. ఫైబర్‌నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్‌ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు.
3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య
4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు.
5. APSFL నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్‌వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్‌వేర్ అడ్రస్ ఒక్కటే.
6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్‌కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్‌కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది.
7. హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్‌కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు.
8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు.
9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్‌ఎల్‌తో ఎంవోయూ ఫైల్‌పై సంతకం చేశారు
10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది.
1:40 PM, సెప్టెంబర్ 29, 2023
లోకేష్ ఇప్పటికైనా బయటకు రావాలి : మంత్రి రోజా
► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది
► తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాలి
► తప్పు చేయక పోతే ముందస్తు బెయిల్‌కు ఎందుకు దరఖాస్తు చేస్తుకున్నారు?
► యువగళం పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు?
► ఎన్టీఆర్ కూతురు, మనవరాలిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అభిమానిస్తాం,
► టిడిపి స్క్రిప్ట్ చదివితే మాత్రం తప్పులు ఎత్తి చూపిస్తాం
► ఎర్ర బుక్‌లో రాసుకున్నాము, తాట తీస్తాం అన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
1:35PM, సెప్టెంబర్ 29, 2023
కుంభకోణం గురించి మాట్లాడరెందుకు? : సజ్జల రామకృష్ణారెడ్డి
► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది
► ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది
► సాక్ష్యాధారాలతో దొరికితే చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపింది
► జరిగిన కుంభకోణంపై వీరంతా మాట్లాడడం లేదు
► దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు
► మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు
► చంద్రబాబు అరెస్టును దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు
► రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు, ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు
► మూడేళ్లు దర్యాప్తు చేశాక ఆధారాలతో అరెస్ట్ చేశారు
► స్కిల్ స్కామ్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి
► తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్టేట్‌మెంట్ ఇచ్చింది
► గంటా సుబ్బారావుకు నాలుగు పదవులిచ్చారు
► మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయి
► డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు
1:25PM, సెప్టెంబర్ 29, 2023
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్
► హైకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు
► ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్
► ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు
12:55PM, సెప్టెంబర్ 29, 2023
ఇండియా కూటమి వైపు సైకిల్ వెళ్తొందా.? బయటకొస్తున్న అసలు ఎజెండాలు
► చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటివరకు తెగ ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్
► హైదరాబాద్‌లో ధర్నాలను పోలీసులు నిలిపివేయడంపై టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆగ్రహం
► చంద్రబాబును వెనకేసుకొస్తూ ప్రకటనలు చేస్తోన్న రేవంత్
► గతంలో చంద్రబాబుతో కలిసి ఓటుకు కోట్లు పంపిణీ చేసి రెడ్ హండెడ్‌గా దొరికిన రేవంత్
► తాజాగా చంద్రబాబు కోసం తెగ ఆరాట పడ్డ మోత్కుపల్లి
► బాబును తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించి తెలుగుదేశం పార్టీనే ఆశ్చర్యపరిచిన మోత్కుపల్లి
► ఇవ్వాళ బెంగళూరుకు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు
► డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి నర్సింహులు
► పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అంటోన్న మోత్కుపల్లి
► డీకే శివకుమార్ డైరెక్షన్‌తోనే చంద్రబాబుకు మోత్కుపల్లి మద్ధతిచ్చారా?
12:45PM, సెప్టెంబర్ 29, 2023
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యార్లగడ్డ క్వాష్ పిటిషన్‌లు
► లోకేష్ యువగళం పాదయాత్రలో రెచ్చిపోయిన యార్లగడ్డ వెంకట్రావు
► తన మనుష్యులతో కలిసి వీరంగం సృష్టించినట్టు యార్లగడ్డపై అభియోగాలు
► గన్నవరం నియోజకవర్గంలోని రంగన్నగూడెం, వీరవల్లి పోలీస్ స్టేషన్‌లు ముట్టడి
► ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యార్లగడ్డ వెంకట్రావు
► మూడు కేసుల్లో క్వాష్ పిటిషన్ వేసిన యార్లగడ్డ
► యార్లగడ్డ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు
12:25PM, సెప్టెంబర్ 29, 2023
విజయవాడ వేదికగా కురుక్షేత్ర సంగ్రామ శంఖారావాన్ని పూరించిన CM వైఎస్ జగన్
► ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలోని స్కాముల నేతలకు మధ్య యుద్ధం
► ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్...
► అమరావతి పేరుతో స్కాములు చేసిన గత నాయకులతో యుద్ధం
► గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే
► గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు?
► దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి
► దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి
► వాళ్లకు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు
► వంత పాడేందుకు వాళ్లకున్నట్టు దత్త పుత్రుడు లేడు
► పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు
► మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి
► ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలవండి
► ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి
12:15PM, సెప్టెంబర్ 29, 2023
రాజమండ్రి జైలుకు నారాయణ, చంద్రబాబుతో ములాఖత్
► 20 రోజులుగా జైల్లో ఉన్నా చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదు
► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి లోకేష్‌పై కేసు పెట్టారు
► ఇన్నర్ రింగ్‌రోడ్‌లో నా సొంత భూమి పోయింది, దాని ఖరీదు ఏడు కోట్ల రూపాయలు
► జనసేనతో పొత్తుపై ఉమ్మడి కమిటీ వేస్తాం
► కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు వెళ్తాం
► అన్ని విషయాలు కోర్టులోనే తేలుతాయి, బాబు జైల్లో ధైర్యంగా ఉన్నారు
12:05PM, సెప్టెంబర్ 29, 2023
ఎక్కడ దాక్కున్నా తప్పుంటే అరెస్ట్ కావాల్సిందే : లోకేష్ ఛాలెంజ్‌కు పేర్ని నాని కౌంటర్
► ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము CIDకి లేదా ? : లోకేష్ ఛాలెంజ్
► ఢిల్లీ కాదు.. సప్త సముద్రాల అవతల చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే : పేర్ని నాని
నారా లోకేష్‌ని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలోనే కాదు.. చెట్టు తొర్రలో దాక్కున్నా దర్యాప్తు అధికారులు నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకురాగలరు. చంద్రబాబు కంటే నువ్వేమీ పోటుగాడివి కాదు కదా @naralokesh..? కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేయాలి? అనేది దర్యాప్తు… pic.twitter.com/dLLF8HcNj3
— YSR Congress Party (@YSRCParty) September 28, 2023
12:00PM, సెప్టెంబర్ 29, 2023
పచ్చమీడియాకు ఇంత పక్షపాతమా? : YSRCP
► ఏ కేసులోనయినా ఏ మీడియా అయినా రెండు వర్షన్లను కవర్ చేస్తారు
► కానీ స్కిల్ స్కాంలో పచ్చమీడియా నిజాలు దాచిపెడుతోంది
► మేం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే కవర్ చేయలేదు
► టిడిపి వాళ్లు అసత్యాల ప్రజంటేషన్‌కు మాత్రం ఎల్లో మీడియా పట్టం కట్టింది
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజెంటేషన్ రూపంలో క్లియర్‌గా ప్రభుత్వం చూపించినా.. ఎల్లో మీడియా మాత్రం ప్రసారం చేయలేదు. కేవలం టీడీపీ వాళ్లు చెప్పింది మాత్రమే ప్రజలకి చూపించారు. బాబు అరెస్ట్ తర్వాత ఎల్లో మీడియా పిచ్చి పీక్స్‌కి చేరిపోయింది. దీన్ని… pic.twitter.com/mimAxmJcXA
— YSR Congress Party (@YSRCParty) September 28, 2023
11:40AM, సెప్టెంబర్ 29, 2023
మరో రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన లోకేష్
►హైకోర్టులో మరో రెండు పిటిషన్లు వేసిన లోకేష్ లాయర్లు
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో నిందితుడు లోకేష్
►ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
►అరెస్ట్ చేస్తారు, అత్యవసరంగా విచారించండి : హైకోర్టుకు అభ్యర్థన
►మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు పిటిషన్లు వచ్చే అవకాశం
11:20AM, సెప్టెంబర్ 29, 2023
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు : హైకోర్టు : BIG BREAKING
►IRR కేసులో నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు
►దర్యాప్తుకు లోకేష్ సహకరించాల్సిందే : హైకోర్టు
►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు నోటీసులు
►కేసు దర్యాప్తుకు లోకేష్ సహకరించాలన్న హైకోర్టు
►కుంభకోణంలో లోకేష్ పాత్రను స్పష్టం చేస్తూ 129 ఆధారాలు సేకరించిన సిట్
►ముందస్తు బెయిల్ పిటిషన్‌కు అంగీకరించని న్యాయస్థానం
►దర్యాప్తు అధికారి FIRలో మార్పు చేశారని నివేదించిన అడ్వొకేట్ జనరల్
►41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని చెప్పిన అడ్వొకేట్ జనరల్
11:15AM, సెప్టెంబర్ 29, 2023
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?
► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు
1. అలైన్‌మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్‌మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా?
2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా?
3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా?
4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా?
5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా?
6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా?
7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా?
11:02AM, సెప్టెంబర్ 29, 2023
41 ఏ కింద లోకేష్‌కు నోటీసులు: ఏజీ శ్రీరామ్
►IRR కేసులో నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు
►కోర్టులో వెల్లడించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్
►హైకోర్టులో ఏపీ సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు
►నోటీసుల కాపీ హైకోర్టుకు అందజేత
► ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణ
► లోకేష్ తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్
10:55AM, సెప్టెంబర్ 29, 2023
బటన్ నొక్కడంలో తేడాలు గమనించండి: YSRCP
► జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ
► అదే చంద్రబాబు బటన్ నొక్కితే.. ఫస్ట్ కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ
► మళ్లీ ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది.
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి అసైన్డ్ భూమల స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కాంలో అంతర్లీనంగా జరిగింది ఇదే..!
జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
— YSR Congress Party (@YSRCParty) September 29, 2023
కానీ.. చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం,… pic.twitter.com/mQ8rlC4JfQ
10:50AM, సెప్టెంబర్ 29, 2023
IRR కేసులో లోకేష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►లోక్‌ష్ తరపున వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్
► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంతో లబ్ధి పొందినట్లు ఏపీ సీఐడీ అభియోగం
10:04AM, సెప్టెంబర్ 29, 2023
కుటుంబ సభ్యుల ములాఖత్ నేడు!
►నేడు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు
►రాజమండ్రి జైలులో ఉ.11 గం.కు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
► సతీమణ భువనేశ్వరి, కోడలు బ్రహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా
08:58AM, సెప్టెంబర్ 29, 2023
విధుల్లో చేరిన జైలు సూపరిండెంట్
►రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ విధుల్లో చేరిన రాహుల్
►కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో విధులకు దూరంగా ఉన్న సూపరిండెంట్ రాహుల్
►జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే విపరీతార్థాలు తీసిన పచ్చ మీడియా
►పచ్చ మీడియా తీరుపై వెల్లు వెత్తిన విమర్శలు
08:45AM, సెప్టెంబర్ 29, 2023
సుప్రీంలో బాబుకు మరో దెబ్బ!
►సుప్రీం కోర్టులో చంద్రబాబు SLP లిస్టింగ్‌కే మరింత ఆలస్యం
►అక్టోబర్ 3 కాదు.. 6?
►ఇంతకు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబరు 3కి వాయిదా
►కానీ, అక్టోబర్ 6వ తేదీ.. అదీ లిస్టింగ్‌కు వచ్చే ఛాన్స్
► అంటే ఆరోజు.. పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారా? అని చెప్పే ఛాన్స్
► ఒకవేళ విచారణ చేపడితే.. ఏ రోజు విచారణ చేపడతారో ప్రకటిస్తుంది బెంచ్
►సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఈ మేరకు కంప్యూటర్ జనరేటెడ్ ధృవీకరణ
08:33AM, సెప్టెంబర్ 29, 2023
శతవిధాల ప్రయత్నాలు
►చంద్రబాబు బెయిల్ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ వర్గాలు
►లోకేష్ అరెస్టు అవుతాడని రాజమండ్రిలో వదంతులు
►అరెస్టు అవుతాడనే కారణం తోనే ఢిల్లీ నుంచి రాకుండా జాప్యం చేస్తున్నారంటూ వార్తలు
►ఇవాళ నుంచి ప్రారంభం కావలసిన యువగళం వాయిదా
►సుప్రీంకోర్టులో క్వాష్ ఫలితం తేలిన తర్వాతే రాజమండ్రి కి రానున్న లోకేష్
►రాజమండ్రి టిడిపి శిబిరంలో నారా బ్రాహ్మణి భువనేశ్వరుని ముందు పెట్టుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్న టీడీపీ శ్రేణులు
►‘‘బాబుతో మేము’’, ‘‘పోస్ట్ కార్డు ఉద్యమం’’ తో పాటు రిలే నిరాహార దీక్షలు ,దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు
►ప్రజల నుంచే కాదు.. టీడీపీ కార్యకర్తల నుంచి కూడా కనిపించని స్పందన
07:10AM, సెప్టెంబర్ 29, 2023
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
►నేడు హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం
►అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ14గా లోకేష్ పేరు చేర్చిన ఏపీ సీఐడీ
► అరెస్ట్ భయంతో.. ఢిల్లీ నుంచే యాంటిసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు
► బెయిల్ వస్తేనే యువగళం పాదయాత్ర.. లేకుంటే మరిన్ని రోజులు ఢిల్లీలోనే
07:05AM, సెప్టెంబర్ 29, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
► మధ్యాహ్నం 2.15కి ప్రారంభంకానున్న విచారణ
►ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా
►మరోసారి వాదనలు వినిపించనున్న ఏజీ
►చంద్రబాబు కేసులు..బెయిల్ పిటిషన్లతో టీడీపీ(TDP) శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది.
07:00AM, సెప్టెంబర్ 29, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @20
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►ఏసీబీ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్ 20వ రోజుకి చేరిక
► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ
► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు
► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment