అల్లిపురం (విశాఖ దక్షిణ): చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ.90కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోడిగుడ్డుదీ అదే దారి..
కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్‌లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు.
గిట్టుబాటు కావడం లేదు
కోళ్ల రైతులకు ప్రస్తుత ధరలు గిట్టుబాటు కావటం లేదు. పిల్ల రేటు, ఫీడ్ రేటు పెరిగిపోయింది. మరో పక్క ట్రాన్స్‌పోర్టు చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోయాయి. చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వం చికెన్ వ్యాపారులను ఆదుకోవాలి.
– టి.అప్పారావు, బ్యాగ్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment