
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని అరగంటకు పైగా భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను కూలంకషంగా వివరిస్తారని తెలిసింది. (సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక)