
ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జ�...
చార్మినార్: పాతబస్తీలోని నెహ్రూ జుల...
ముహూర్తాల కోసం వేచి చూస్తున్న వారికి...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల...
మొబైల్ ఇస్తారా ఒకసారి ఫోన్ చేసుకుం...
ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్త�...
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకో...
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యా...
నిజాం పాలనలో రజాకార్ల దాడుల గురించి �...
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వాని...
హైడ్రేషన్.. వేసవిలో ఈ పదం మన ఆరోగ్యాన...
న్యూఢిల్లీ, సాక్షి: కంచ గచ్చిబౌలి భూమ�...
హైదరాబాద్ నగరానికి విదేశాల నుంచి పం...
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టా�...
జపనీయులు సాంకేతికంగా ఎంత ముందు ఉన్నా...
Published Fri, Feb 18 2022 8:16 AM | Last Updated on Fri, Feb 18 2022 11:32 AM
హరేకృష్ణ గోకుల క్షేత్రానికి శంకుస్థాపన..
తాడేపల్లి మండలం కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి మండలం కొలనుకొండ చేరుకున్నారు.
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించిన అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండ బయల్దేరారు. ఇక్కడ హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. ఇస్కాన్ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. దీనిని రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇస్కాన్ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది.
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది.
►ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించనున్న సీఎం
►11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ
►ఇస్కాన్ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆద్వర్యంలో నిర్మాణం, ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్
►ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది చేసేలా ఇస్కాన్ ప్రణాళికలు
మంగళ గిరి ఆత్మకూరు వద్ద ఒకేసారి 50 వేల మందికి భోజనం ఏర్పాటు చేసేందుకు అక్షయపాత్ర ఆధ్వర్యంలో నూతన భవానాన్ని నిర్మించామని, ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ (బెంగళూరు) మధు పండిట్ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షులు సత్యగౌరి చందన దాస్ విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు అతిరథ మహారధులు హాజరవుతారని తెలిపారు.
విజయవాడ హరేకృష్ణ మూమెంట్ సభ్యులు గురువారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చెన్నై కోల్ కత్తా జాతీయ రహదారి వెంబడి కొలనుకొండ వద్ద నిర్మిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొలనుకొండలో దేవాదాయ భూమిని తమ సంస్థకు లీజుకు ఇచ్చారని, అందులో రూ.70 కోట్లతో రాధాకృష్ణ, వెంకటే శ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, మెడిటేషన్ హాల్, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం నిర్మిస్తున్నామని వివరించారు.
సాక్షి, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): కొలనుకొండ జాతీయ రహదారి వెంబడి హరేకృష్ణ మూమెంట్ ఇండియా (విజయవాడ) రూ.80 కోట్ల వ్యయంతో హరేకృష్ణ గోకుల క్షేత్రం నిర్మించనుంది.