విద్యార్థుల చదువులు ఆనందంగా సాగాలి: సీఎం జగన్‌ | CM Jagan Review Meeting On Higher Education At Tadepalli | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష

Published Mon, Nov 2 2020 3:35 PM | Last Updated on Mon, Nov 2 2020 5:30 PM

CM Jagan Review Meeting On Higher Education At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్య పరంగా ఇప్పటి వరకూ చేపట్టిన సంస్కరణలు, వాటి ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నత విద్యాశాఖ స్పెష్‌ల్ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్ఈ ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, సీసీఈ స్పెషల్ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. భేటీలోని ముఖ్యాంశాలు: 

ఆన్‌లైన్‌ క్లాసులు
►ఉన్నత విద్య పరంగా ఇప్పటి వరకూ చేపట్టిన సంస్కరణలు, వాటి ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. 
►ఈ విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభం, తీసుకుంటున్న చర్యలను సీఎంకు నివేదించారు.
►కోవిడ్‌ కాలంలో ఎనీటైం, ఎనీవేర్‌ లెర్నింగ్‌ పద్ధతిలో 5 లక్షల ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించామని తెలిపిన అధికారులు
►దీనిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచనలు చేయాలన్న సీఎం జగన్‌ సూచించారు.

విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు
►కోవిడ్‌ కారణంగా వృథా అయిన కాలాన్ని కవర్‌ చేసే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావొద్దు.
►విద్య అన్నది వికాసానికి దారి తీయాలే తప్ప ఒత్తిడితో సతమతం అయ్యే పరిస్థితి తీసుకురావద్దు.
►చదువులు ఆనందంగా సాగాలి కాని, ఒత్తిళ్ల మధ్య ఉండకూడదు.
►కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
►ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలి.     (చదవండి: మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు)

యూనివర్సిటీలు, ప్రమాణాలు
►ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రమాణాలపై సమావేశంలో చర్చించారు.
►లైసెన్సింగ్‌ విధానం, రెగ్యులేషన్‌ పటిష్టంగా ఉండడంపై సమావేశంలో చర్చకు వచ్చింది.
►మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రైవేటుసంస్థలకు వెళ్తారు.
►అలాంటి సందర్భాల్లో ఆయా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రమాణాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలన చేయాలి.
►ప్రైవేటు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు, ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలి.
►50 శాతం సీట్లు కన్వినర్‌ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు కాలేజ్‌ కోటా కింద ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.
►ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం కన్వీనర్‌ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, వారికి ప్రభుత్వమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద ఫీజులు చెల్లిస్తుంది.
►ఈ ప్రైవేటు యూనివర్శిటీలకు నిర్వహిస్తున్న కోర్సుల ప్రకారం ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ (న్యాక్‌) గుర్తింపు కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థలు
►ఐఐటీ తిరుపతి, ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్‌ఐటీ తాడేపల్లి గూడెంలో పనుల ప్రగతిని అధికారులు వివరించారు.
►ఆయా సంస్థలకు వెళ్లే రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి వాటిలో సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
►అనంతపురం సెంట్రల్‌ వర్శిటీ పనుల తీరును సీఎంకు అధికారులు వివరించారు.
►పనులు ముందుగా సాగేలా చర్యలు తీసుకోవాలి.
►ట్రైబల్‌ యూనివర్శిటీపై దృష్టి సారించాలి.     (జగన్‌ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు)

కోర్సుల ఇంటిగ్రేషన్‌
►పాలిటెక్నిక్‌ కోర్సుల్లో కొత్త కోర్సులను తీసుకురావాలి.
►ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి.
►కోర్సుల ఇంటిగ్రేషన్‌ ఉండాలి.
►ఇంజినీరింగ్‌ కోర్సులతోపాటు వెటర్నరీ, అగ్రికల్చర్‌ కోర్సులను అవసరాలకు అనుగుణంగా ఇంటిగ్రేషన్‌ చేసేలా మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలి.
►ఉద్యోగాల కల్పనా కేంద్రాలుగా పాలిటెక్నిక్‌ కాలేజీలను తీర్చిదిద్దాలి.
►దేశంలో, ప్రపంచంలో వస్తున్న కొత్త కోర్సులను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చి వాటిని ఈ కాలేజీల్లో ప్రవేశపెట్టాలి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు
►నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌) పెడుతున్నాం.
►ఇదివరకే పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ లాంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ల ప్రతిభకు అక్కడ మరింత మెరుగులు పెడతారు.
►అలాగే చిన్న చిన్న పనులు నేర్పించడానికి కూడా కోర్సులు ప్రవేశపెడతారు.    (బీసీలంతా వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటారు: జయరాం)

కెపాసిటీ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌లు
►సామర్థ్యాన్ని పెంచేలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కెపాసిటీ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ను తీసుకురావాలి.
►టీచర్లు మొదలు సచివాలయాల ఉద్యోగుల వరకు అందరిలో నైపుణ్యాలను పెంచేలా అవి ఉపయోగపడతాయి.
►శిక్షణ కేంద్రాలుగా కూడా ఆ కాంప్లెక్స్‌లు పని చేస్తాయి.
►జిల్లాల్లో మంచి సదుపాయాలున్న కాలేజీలను, ఇతర ప్రభుత్వ శిక్షణా కేంద్రాలను ఈ కెపాసిటీ బిల్డింగ్‌ కోసం వాడుకునే అవకాశాలను పరిశీలించాలి.
►సామర్థ్యాన్ని పెంచడంలో ఐఐటీల భాగస్వామ్యం కూడా తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement