సాక్షి, అమరావతి: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు రెండో దశ వేగం పెరగాలని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రెండో దశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు చేపడుతున్నామని.. రెండో దశ నాడు-నేడు పనుల ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు ఈ ఏడాది కనిపించాలని సీఎం అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నాడు-నేడు ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
చదవండి: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
సీఎం జగన్ ఏమన్నారంటే...:
♦నాడు-నేడు రెండోదశ ఖర్చు అంచనా రూ. 11,267 కోట్లు
♦ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఇంగ్లిషు మాధ్యమంలోకి
♦నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు
♦దీంతోపాటు ప్రతి మండలానికీ 2 జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోండి
♦వీటిలో అమ్మాయిలకోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలి
♦దీనిపై కార్యాచరణ తయారుచేయాలి: అధికారులకు సీఎం ఆదేశం
♦జగనన్న విద్యాకానుకకు సర్వం సిద్ధం అయ్యామని తెలిపిన అధికారులు
♦స్కూళ్లు తెరిచే నాటికి వారికి విద్యాకానుక అందించేలా చర్యలు
♦విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు
♦గతేడాదితో పోలిస్తే మరో రూ.200కోట్లకుపైగా అదనపు ఖర్చు
♦విద్యాకానుక కోసం ఖర్చు అయినా పర్వాలేవు: సీఎం
♦పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే
♦వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
♦నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తిచేశామన్న అధికారులు
♦విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపిన అధికారులు
♦ఈ జులై నుంచి మొదటి విడతలో మ్యాపింగ్ చేసిన స్కూళ్లు ప్రారంభం
♦తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించిన సీఎం
♦కావాల్సిన తరగతి గదులను శరవేగంగా పూర్తిచేయాలన్న సీఎం
♦అవి పూర్తవుతున్న కొద్దీ దశలవారీగా ఆరు రకాల స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియ కొనసాగాలన్న సీఎం
♦2022 జులై, 2023 జులై, 2024 జులై... ఇలా దశలవారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలన్న సీఎం
♦దశలవారీగా ఏర్పాటవుతున్న స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలి : సీఎం
♦జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తికావాలి
♦ఇప్పటివరకూ 1310 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ చేయించామన్న అధికారులు
♦ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌తో ఉండాలి
♦ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం
♦ఇంగ్లిషు పదాల ఉచ్ఛారణపై యాప్‌ను టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్న సీఎం
♦తల్లిదండ్రుల ఫోన్లలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచేలా చూడాలన్న సీఎం
♦విద్యావ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాలమేరకు ఎస్‌ఓపీ రూపొందించిన అధికారులు
♦స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై అవగాహన కల్పించనున్న మహిళా పోలీసులు
♦మహిళా ఉపాధ్యాయులు, బాలికలకు అన్నిరకాల వేధింపులనుంచి రక్షణకోసం దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించడంతో పాటు వారికి యాప్ వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యం
♦బాల్య వివాహాల నివారణ
♦మత్తుమందులకు దూరంగా ఉంచడం
♦పోక్సో యాక్ట్‌పై అవగాహన
♦ఫిర్యాదుల బాక్స్ నిర్వహణ పై అవగాహన
♦జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం
♦నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా?లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం
ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment