చప్పట్లతో సీఎం జగన్‌ అభినందనలు | CM YS Jagan Mohan Reddy Hailed village, ward volunteers | Sakshi
Sakshi News home page

చప్పట్లతో సీఎం జగన్‌ అభినందనలు

Published Fri, Oct 2 2020 7:03 PM | Last Updated on Fri, Oct 2 2020 8:23 PM

CM YS Jagan Mohan Reddy Hailed village, ward volunteers - Sakshi

సాక్షి, తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటర్లకు అభినందనలు తెలిపారు. (గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్‌)

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా ఏడాది. గత ఏడాది అక్టోబర్‌ 2న సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జీవం పోశారు. కార్యదర్శుల నియామకం చేపట్టి ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో ప్రారంభించారు. సమస్త సేవలనూ ప్రజలకు చేరువ చేశారు. సచివాలయ వ్యవస్థతో సరికొత్త విప్లవం తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు సామాన్యుడు సైతం సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు గ్రామ సచివాలయలు ఉపయోగుపడుతున్నాయి. ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ పథకాలు సైతం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే దరిచేరుతున్నాయి. 

సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కరప సచివాలయం వద్ద చప్పట్లు కొట్టి సచివాయం ఉద్యోగులు,వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.
గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి తన నివాసం లో చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.

వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా విద్య శాఖ మంత్రి ఆదిములపు సురేష్ తన నివాసంలో చప్పట్లు కొట్టి అభినందించారు.
సంవత్సర కాలంలో కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్  ఆలోచనలకు అనుగుణంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా ప్రజల చెంతకే చేరేలా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు అద్భుతంగా పని చేసినందుకుగాను  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత  రెండు నిమిషాలు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.
హోంమంత్రి సుచరిత చప్పట్లతో సంఘీభావం

నెల్లూరు: గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అనంతపురం: సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను అభినందిస్తూ పెనుకొండలోని తన నివాసంలో చప్పట్లు కొట్టి ప్రోత్సాహించిన మంత్రి శంకర్ నారాయణ.
విజయవాడ: గ్రామ వాలంటీర్ల సేవలకు సంఘీభావం తెలుపుతూ డిప్యూటీ సీఎం కళాత్తూర్ నారాయణ స్వామి తన కుటుంబ సభ్యులుతో సహా కృతజ్ఞతపూర్వకంగా చప్పట్లు కొట్టారు.
విశాఖ: గ్రామ,వార్డుసచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థకు మద్దతుగా చప్పట్లు కొడుతూ వైజాగ్ బీచ్ రోడ్ నుంచి  వైస్సార్ విగ్రహం వరకు మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్‌ సృజన పాల్గొన్నారు. 
గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రోజా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. సీఎం జగన్‌ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ సేవాలందిస్తోందని రోజా పేర్కొన్నారు.

విజయవాడ: సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్‌లో వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తి కావడంతో సీఎం ఆదేశాల మేరకు  డివిజన్లో స్థానికులు చప్పట్లు కొడుతున్న దృశ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement