ఈనెల 19న పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Mohan Reddy Polavaram Visit On 19th | Sakshi
Sakshi News home page

ఈనెల 19న పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Jul 16 2021 9:30 PM | Last Updated on Fri, Jul 16 2021 11:16 PM

CM YS Jagan Mohan Reddy Polavaram Visit On 19th - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

సీఎం పర్యటన వివరాలు... సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉ.10.10కి బయలుదేరి పోలవరంలోని హెలిప్యాడ్‌కు ఉ.11 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరి  కాపర్ డ్యామ్, తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. తదుపరి అక్కడ నుంచి ఉ.11.50 గంటలకు బయలుదేరి సమావేశ మందిరంకు మ.12.00కి చేరుకుని మ.1.00 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పోలవరం లోని సమావేశ మందిరం నుంచి మ.1.10  బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకుని మ.1.20 కు అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి  చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement