
సాక్షి, అమరావతి: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అద్భుతమైన పోరాటంలో నాయకత్వం వహించిన మన పూర్వీకులు, నాయకులను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అద్భుతమైన పోరాటంలో నాయకత్వం వహించిన మన పూర్వీకులు, నాయకులను స్మరించుకుందాం. వారు రూపొందించి అందించిన రాజ్యాంగం 71 ఏళ్ల తర్వాత కూడా మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉంది. జై హింద్’ అని సీఎం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment