
సాక్షి, తాడేపల్లి: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అందరం గుర్తుంచుకోవాలని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మార్పు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచిందని కొనియాడారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పటికీ, చట్టంలో జగన్ తెచ్చిన మార్పు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. దేశంలో కోరుకుంటున్న మార్పును తొలిసారి ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బు, మద్యం పంపిణీ చేసినా అతని ఎన్నిక రద్దు, రెండేళ్ల జైలు తప్పదని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన వారు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment