సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, జంగాలపల్లె శ్రీనివాసులు, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధవీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించారు. ప్రస్తుతం వేణుగోపాల్ వయసు 95 ఏళ్లు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడంతో సీఎం జగన్ నేరుగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని మాజీ సైనికులను సన్మానించారు.
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వెలిగించిన విజయ జ్వాల (విక్టరీ ఫ్లేమ్) బుధవారం తిరుపతి చేరుకుంది. 20వ తేదీ వరకు తిరుపతిలోనే ఈ జ్వాలకు ఆతిథ్యం ఇస్తున్నారు. చదవండి: (సరిహద్దుల్లో చిన్న అలజడి రేగినా రక్తం మరిగిపోతుంది)
ఈ విజయ జ్వాలకు బుధవారం తిరుపతిలో ఏవోసీ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ జేజేఎస్ బిందర్ సైనిక గౌరవాలతో అందుకున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ స్వీకరించనున్నారు. వేణుగోపాల్ ఇంటి వద్ద సీఎం జగన్ ఓ మొక్కను నాటుతారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని అక్కడ కొంతమంది యుద్ధవీరులను సత్కరిస్తారు. తర్వాత సభను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడనున్నారు.
చదవండి: పేదల ఇళ్లు అద్భుతంగా ఉండాలి: సీఎం జగన్
ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment