
సాక్షి, అమరావతి: తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టడానికి గుర్తు చేసుకొని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ..‘నా తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన జిల్లాలో మొదటిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నాను.
తన తండ్రి ఆశీస్సులు, భగవంతుని కృపతో...’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ సంస్థాగత దినోత్సవం సందర్భంగా పురందేశ్వరి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ తీసివేయడం జరగదని, యాజమాన్యం మాత్రమే మారుతోందని చెప్పారు.