సాక్షి, అమరావతి: ఏపీలో న్యాయ వ్యవస్థ పనితీరు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, హైకోర్టు వ్యవహారాల్లో ఆయన జోక్యం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది. జస్టిస్ రమణ, ఇతర హైకోర్టు జడ్జిలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. (అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట)
ఏపీలో జరుగుతున్న పరిణామాలను సాక్ష్యాధారాలతో నివేదిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలోని అంశాలను ఆదివారం పలు జాతీయ పత్రికలు పతాక శీర్షికన ప్రచురించగా టీవీ చానళ్లు ప్రముఖంగా చర్చలు నిర్వహించాయి. హిందుస్థాన్ టైమ్స్, ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద సండే ఎక్స్‌ప్రెస్ తదితర జాతీయ పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. పలువురు ట్వీట్లు కూడా చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలోని ఒక వర్గం మీడియా మాత్రం యథావిధిగా ఆ వార్తను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా తొక్కిపట్టడంతోపాటు ప్రభుత్వ అధికారిక ప్రకటనను కూడా విస్మరించడం ద్వారా నిస్సిగ్గుగా తన నైజాన్ని మరోసారి చాటుకుంది. తద్వారా వాటి ముసుగు తొలగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది..)
ధర్మ పోరాటాన్ని స్వాగతించిన న్యాయ కోవిదులు
న్యాయవ్యవస్థపై.. హైకోర్టుపై.. సుప్రీం కోర్టుపై అత్యంత గౌరవ ప్రపత్తులను చాటుకున్న సీఎం వైఎస్ జగన్ కొద్దిమంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహారశైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నం చేయటాన్ని స్వాగతిస్తూ రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ తదితరులు ట్వీట్‌లు చేశారు. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్)
ప్రజలు, సుప్రీం దృష్టికి అంశాలు..
– రాజ్‌దీప్ సర్దేశాయ్, కన్సల్టింగ్ ఎడిటర్, ఇండియా టుడే గ్రూప్.
“ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ కుటుంబం అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి కథనాలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా హైకోర్టు ఒక వింత గాగ్ ఆర్డర్ ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది’
ఏ చర్యలు తీసుకుంటారు?
– అశోక్ కేమ్కా, సీనియర్ ఐఏఎస్
“జస్టిస్ ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఏ చర్యలు తీసుకుంటారు? అవాస్తవమని తేలితే ఏ చర్యలు తీసుకుంటారు? విచారణే చేయకపోతే అప్పుడేంటి?’
సీఎం జగన్ చర్య అపూర్వం..
– నిధి రజ్దాన్, అసోసియేట్ ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికా.
“ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డేకే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడం అపూర్వం’ (ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ట్వీట్‌కు ట్యాగ్ చేశారు)
ప్రధానికి కార్యాచరణ వివరించాకే..
– సిద్ధార్థ వరదరాజన్, ఎడిటర్–ఇన్–చీఫ్, ద వైర్
“ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన మరునాడే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డేకు భారీ లేఖ రాశారు’
“రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన పలు ఆదేశాల గురించి తీర్పులో సీఎం జగన్ ప్రస్తావించారు’ – దక్కన్ క్రానికల్
విచారణతోనే న్యాయం
Published Mon, Oct 12 2020 2:58 AM | Last Updated on Mon, Oct 12 2020 11:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment