సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్, ప్రముఖ సినీ దర్శకుడు బాబీ, చెస్ మాస్టర్ ద్రోణవళ్లి హారిక సహాడ్రమ్స్ ప్లేయర్ శివమణిలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులు వేదశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో షూటింగ్లు ప్రారంభం అయ్యాయి.. ఆచార్య సినిమా సినిమా తర్వాత చిరంజీవితో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయయని తెలిపారు.
డ్రమ్స్ ప్లేయర్ శివమణి తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది తన పుట్టిన రోజునాడు శబరిమలలో గడిపేవాడిని ,ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు కారణంగా శబరిమల వెళ్లలేదని, శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మొక్కులు చెల్లించుకున్న ద్రోణవళ్లి హారిక అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా చెస్ పోటీలు ఈ సంవత్సరం జరగలేదని,వచ్చే ఏడాది మార్చ్ నాటికి తిరిగి అంతర్జాతీయ చెస్ పోటీలు ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment