
కడప కల్చరల్: కరోనా మహమ్మారి ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే కొడుకు, తండ్రిని బలితీసుకుంది. వివరాలు.. ‘సాక్షి’ దినపత్రికలో పీసీ ఇన్‌చార్జిగా పనిచేసే మాచుమల్లె ప్రభాకర్‌రెడ్డి(50) కరోనా వల్ల మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన తండ్రి ఓబుల్‌రెడ్డి(83) కూడా కరోనా వల్ల కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుమారుడి మృతి విషయం తెలియకుండానే ఓబుల్‌రెడ్డి కన్నుమూయడం అక్కడివారిని కలచివేసింది. దేవుడు మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తాడా అంటూ బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రీ కొడుకు చివరి వరకు చాలా అన్యోన్యంగా ఉండేవారంటూ వారు గుర్తుచేసుకున్నారు.
చదవండి:
‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
Comments
Please login to add a commentAdd a comment