సాక్షి, అమరావతి: మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటి చర్యలను పోలీసుశాఖ ఉపేక్షించదని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఆలయ ఘటనలకు సంబంధించి నమోదైన ఐదు కేసుల్లో బుధవారం చర్యలు తీసుకున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఆయన తెలిపిన మేరకు..
► ఆలయాలకు సంబంధించిన విషయాలు వాస్తవమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు.
► ఇప్పటివరకు రాష్ట్రంలో అంతర్వేది ఘటన మొదలు 33 కేసుల్లో 27 కేసులను ఛేదించాం. మూడు అంతర్‌రాష్ట్ర ముఠాలను అరెస్టు చేశాం. ఇప్పటివరకు అపరిçష్కృతంగా ఉన్న 76 కేసుల్లో 178 మందిని అరెస్టు చేశాం. ఈ కేసులకు పరస్పర సంబంధం లేకపోయినా ఉన్నట్లు కొందరు ప్రచారం చేశారు. ఇటువంటి ఘటనల ఆసరాగా అలజడులు రేపాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
► నరసరావుపేటలోని కృష్ణవేణి కళాశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. స్థల యజమానులు ఆ స్థలాన్ని పదేళ్ల కిందట కృష్ణవేణి కళాశాలకు అద్దెకు ఇచ్చారు. రెండున్నరేళ్ల కిందట కళాశాల వారిని ఖాళీ చేయించారు. కళాశాల వారు నిర్మించిన రేకుల షెడ్లను తొలగించే క్రమంలో సరస్వతీదేవి విగ్రహానికి నష్టం వాటిల్లిందని స్థల యజమానులు తెలిపారు. అంతేతప్ప విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ప్రచారం అవాస్తవం.
మతాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించం
Published Thu, Oct 8 2020 4:35 AM | Last Updated on Thu, Oct 8 2020 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment