Religions
-
దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?
దీపావళిని కేవలం హిందువులు మాత్రమే కాదు వివిధ రకాల మతస్తులు కూడా జరుపుకుంటారు. అందులో కూడా చాలా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇక దీపాలు వెలిగించి బాణాసంచాలు కాలుస్తూ దేశవిదేశాల్లో ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఏయే మతస్తులు ఏవిధంగా జరుపుకుంటారో చూద్దాం!. ఈ పండగను హిందువులతో పాటుగా బౌద్ధులు, జైనులు,సిక్కులు కూడా వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి పాటిస్తారు! కొందరు ఈ పండుగ నుంచి కొత్త సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తారు! ఈ పండగని ఉత్తర భారత దేశంలో ఐదు రోజుల పండుగగా చేస్తారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా వ్యవహరిస్తూ ..ఆ రోజు లక్ష్మీ పూజ చేసే అలవాటు కూడా ఉంది. మనం మూడు రోజుల పండుగగా దీన్ని జరుపుకుంటాం !నరక చతుర్దశి,దీపావళి అమావాస్య,బలి పాడ్యమి అని ఆ మూడు రోజులను వ్యవహరిస్తారు!మొదటి రెండు రోజులు ఆశ్వయుజ మాసంలో చివరన వస్తాయి.మూడవది అయిన బలి పాడ్యమి మాత్రం కార్తీకమాసం మొదటి రోజున జరుపుకుంటారు!నరక చతుర్దశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి,నరకుని సంహరించి ,అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు!సత్యభామ సమేతుడై శ్రీ కృష్ణుడు నరక సంహారం కోసం సమాయత్తమయ్యాడు!ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది!ఆ పౌరాణిక గాధ మీకందరికీ తెలిసిందే! ఈ కధ బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ,ఈ పండుగకు ,దీనికీ సంబంధించిన సరైన నిర్ధారణ ఏ వ్రత గ్రంధాలలోనూ లేదు! నిజానికి దీని అర్ధం 'నరకం'నుండి విముక్తి పొందాలని!అయితే ,దానికి నరకాసురిడి పేరుని అన్వయించి నరక చతుర్దశిగా పండుగను చేసుకుంటున్నారు!ఈ పండుగను దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు! కొత్త బట్టలు ధరించి,మిఠాయిలు పంచి, దీపాలతో గృహాలను అలంకరించి--ఎంతో దేదీప్యమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. వ్యాపారులు ,లక్ష్మీపూజ చేసి వ్యాపార స్థలాలను కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తవారింటికి రావటం కూడా ఆనవాయతీ ఉంది! ఈ పండుగకు దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తారు!. ఈ దీపాలు వెలిగించటం వెనక ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం కూడా లేకపోలేదు!. దుర్గా దీపావళి..! మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని బయటికి త్రోలి,జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని దీని ఉద్దేశ్యం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం. శ్రీరామచంద్రుడు 14 ఏండ్ల అరణ్యవాసం తర్వాత ఈ రోజున మళ్ళీ అయోధ్యలో కాలు పెట్టాడు. విజయదశమి రోజున రావణ సంహారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు దీపావళి పండుగతో పాటుగా కాళీపూజను కూడా జరుపుకుంటారు. వారు ఈ పండుగను దుర్గా దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ దీపావళి పండుగ రోజుల్లోనే అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించటం చేత బౌద్ధులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జైన మత స్థాపకుడైన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు కూడా ఈ దీపావళి పండుగ రోజుల్లోనే రావటం వల్ల, జైనులు కూడా ఆయనకు స్మ్రుతి చిహ్నంగా దీపాలను వెలిగించి ఈ పండుగను చేసుకుంటారు! సిక్కుల తొమ్మిదవ గురువైన గురు హర్ గోవింద్ ఈ రోజునే గ్వాలియర్ చెరసాల నుంచి విడుదలయిన రోజు కావటం చేత, సిక్కు మతస్తులు కూడా దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు. దీపాలను వెలిగించటం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికతను కూడా సంతరించుకుంది. దురదృష్టం ఏమిటంటే,కొందరికి మాత్రమే ఇది దీపావళి,చాలామంది పేదలకు ఇది అమావాస్య !అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అసలు దీపావళి త్వరలోనే రావాలని భగవంతుని వేడుకుందాం! --కూర్పరి - శారదాప్రసాద్ (చదవండి: దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!) -
మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి
భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణగా భాసిల్లుతోంది. అనేక మతాలూ, కులాలూ ఉన్నా... అందరం భారతీ యులమే అన్న భావనతో ప్రజలు సహజీవనం చేస్తు న్నారు. అటువంటి దేశంలో మతతత్త్వ వాదులు... మైనారిటీలపై విద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందూ త్వాన్ని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో వివిధ భాషలు మాట్లాడే జనాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రెండూ దేశ లౌకిక తత్త్వాన్ని దెబ్బతీసేవే. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేవే! హిందూ ముస్లింల ఐక్యత సుదీర్ఘమైనది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. దేశ ప్రజల్ని బ్రిటిష్‌వారి నుంచి వేరుచేసి చూపటానికి ఉత్తర భారతదేశ పత్రికలు ‘హిందుస్తానీలు’ అన్న పదం వాడాయని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తన రచనల్లో తెలిపారు. కానీ దానినే తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఈ దేశం హిందువులది మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ సమగ్రత, లౌకిక వాదాలకు గొడ్డలిపెట్టు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహింసా సిద్ధాంత ఆయుధంతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ... గాడ్సే చేతిలో బలవ్వడానికి మతోన్మాదమే కారణం. ఆ తర్వాత బాబ్రీ మసీదు ధ్వంసం, గుజరాత్‌తో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో విద్వేష పూరిత అల్లర్లు వంటివన్నిటికీ ఈ ఉన్మాదమే కారణమయింది. దీంతో మన లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర భావనే ప్రమాదంలో పడింది. దీనికితోడు ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదేమి టని ప్రశ్నించిన రాష్ట్రాలపైనా, రాష్ట్ర పాలకులపైనా ఆధిపత్యం చెలాయించటమే గాకుండా... ఆ ప్రభు త్వాలను కూల్చివేసే చర్యలు మొదలుపెట్టారు. సమాజంలో కొన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. నేటికీ కొన్ని వర్గాలు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్య నీడల్లోంచి బైటపడక దుర్భర స్థితిలో ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారి టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కోట్లాది మంది సంచార జాతుల వాళ్లు స్థిరనివాసం లేక చెట్ల వెంట, పుట్టల వెంట, గుట్టల వెంట, జనావా సాలకు దూరంలో తమ జీవనాన్ని కొనసాగిస్తు న్నారు. వీరి ఈ స్థితి ఆధునిక భారతదేశానికి అవమానకరం. ఇటువంటి కోట్లాదిమంది అభివృద్ధి గురించి ప్రణాళికలు వేయవలసిన వారు మత తత్త్వంతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయచూడటం ఎంతవరకు సమంజసం? మతతత్త్వం ఎంత ప్రమాదకరమో మన ఇటీవలి చరిత్రే చెబుతోంది. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్‌వారు అను సరించిన ‘విభజించి పాలించు’ విధానం మతాల వారీగా భారత సమాజాన్ని చీల్చింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్ వంటి రాజకీయ సమూ హాలు ఈ క్రమంలో తలెత్తినవే. ఆ తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణలకు ఆయా మతతత్త్వ సమూ హాలు కారణమయ్యాయి. 1922–27 మధ్య కాలంలో 112 మత ఘర్షణలు జరిగాయని ‘సైమన్ కమిషన్’ తన నివేదికలో పేర్కొందంటే అప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక 1947 దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పనవసరమే లేదు. అప్పుడప్పుడూ మత సహనానికి ఇటువంటి దాడుల రూపంలో హాని జరిగినప్పటికీ దేశంలో జాతీయోద్యమ కాలంలోనే కాక... అంతకు ముందూ మతసామరస్యం వెల్లివిరిసిన మాట వాస్తవ దూరం కాదు. అప్పటి ఆ పునాదులే ఇప్ప టికీ ప్రజలను తప్పుదోవ పట్టకుండా కాపాడు తున్నాయి. భాష సంగతి కొస్తే... ‘ఒకే దేశం... ఒకే భాష’ అన్న నినాదంతో దేశ ‘విభిన్నత్వం’పై ఇవ్వాళ దాడి జరుగుతోంది. దేశంలోని అంతర్గత అస్తిత్వాలు, భిన్న సంస్కృతుల మేళవింపులు ఛిద్రం అవుతాయి. ఈ మట్టి పెట్టిన పట్టెడన్నం తిని బతుకుతున్న వాళ్లం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత గొప్ప సంస్కృతి వర్ధిల్లే ఈ నేలపై ‘ఒక మతంగా మన మంతా ఏకం కాకపోతే మనకు మనుగడ లేదని’ చేసే వాదనలు విషతుల్య వాదనలుగా గుర్తించాలి. రామ్ రహీమ్‌ల దోస్తానా వర్ధిల్లాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ఛైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ -
మతాలు కాదు... మనిషే ప్రధానం
అన్నిరకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. మనిషి సజీవంగా ఉంటేనే ప్రభుత్వాలైనా, హక్కుల పోరాటాలైనా ఉనికిలో ఉంటాయి. అందుకే భూమి మీద ప్రమాదంలో ఉన్న మనిషిని ముందు బతికించు కోవాలి. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ జూన్ 21ని మనం ‘హ్యూమనిస్ట్ డే’గా జరుపుకొంటున్నాం. అన్ని దశల్లో అన్నివేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవ వాదం. ఫెడ్రిక్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ తొలిసారి 1808లో ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించాడు. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతి దానికీ కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవ వాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదల య్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలిత కళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోటా, ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్న లకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవవాదం, శాస్త్రీయ అవగాహనా వ్యాప్తి చెందాయి. తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా... కారణం, నైతికత, సామాజిక–ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నింటితోపాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించ బడింది. అదేమిటంటే– ఆధారం లేని విశ్వాసాలు, మూఢ నమ్మ కాలను పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించా లనీ, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందనీ కూడా మాని ఫెస్టోలో రాశారు. మానవవాదం గురించి అవగాహన పెరుగు తున్న దశలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లిష్ వాడు, హ్యూమనిస్ట్‌లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. ‘దైవ భావనను ధిక్కరించేవారు’, ‘ఉట్టి మానవతావాదులు’, ‘అరాచక వాదులు’, ‘ఆస్తులను దోపిడీ చేయువారు’ అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావ జాలంతో, ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్లగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వ వాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్లూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవభావన బలం పుంజు కుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయ బడుతూ వచ్చారు. అందుకే చూడండి. పరిస్థితి ఈనాటికీ పూర్తిగా మారలేదు. మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు. స్వేచ్ఛాలో చనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్లను ‘పిచ్చి’వాళ్ల కింద జమ కడుతున్నారు. విశాల హృదయంతో ఆలోచించలేని వారినీ, ఈ దేవుడు కాదు – ఆ దేవుడనీ, ఈ మతం కాదు ఆ మతమనీ కొట్టుకు చచ్చేవారిని – సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహాను భావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించం డనీ, కారణాల్ని వెతకండనీ బోధిస్తూనే వచ్చారు. అలాంటి వారిలో ఎర్నెస్ట్ రెనన్ పేరు తప్పక చెప్పాలి. ‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’ – అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు... ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’ వాదం – అని నేను మనస్ఫూర్తిగా నమ్ము తున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్కతాటిపై కొచ్చి, నైతిక విలువలతో కూడిన మా‘నవ’వాదంగా రూపు దిద్దుకుంటుంది– తప్పదు!’’ దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదా యాలకు లేదు– వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త ప్రముఖ రచయిత, జీవశాస్త్రవేత్త (జూన్ 21న ‘హ్యూమనిస్ట్ డే’ సందర్భంగా...) -
మతాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించం
సాక్షి, అమరావతి: మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటి చర్యలను పోలీసుశాఖ ఉపేక్షించదని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఆలయ ఘటనలకు సంబంధించి నమోదైన ఐదు కేసుల్లో బుధవారం చర్యలు తీసుకున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఆయన తెలిపిన మేరకు.. ► ఆలయాలకు సంబంధించిన విషయాలు వాస్తవమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. ► ఇప్పటివరకు రాష్ట్రంలో అంతర్వేది ఘటన మొదలు 33 కేసుల్లో 27 కేసులను ఛేదించాం. మూడు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేశాం. ఇప్పటివరకు అపరిçష్కృతంగా ఉన్న 76 కేసుల్లో 178 మందిని అరెస్టు చేశాం. ఈ కేసులకు పరస్పర సంబంధం లేకపోయినా ఉన్నట్లు కొందరు ప్రచారం చేశారు. ఇటువంటి ఘటనల ఆసరాగా అలజడులు రేపాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ► నరసరావుపేటలోని కృష్ణవేణి కళాశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. స్థల యజమానులు ఆ స్థలాన్ని పదేళ్ల కిందట కృష్ణవేణి కళాశాలకు అద్దెకు ఇచ్చారు. రెండున్నరేళ్ల కిందట కళాశాల వారిని ఖాళీ చేయించారు. కళాశాల వారు నిర్మించిన రేకుల షెడ్లను తొలగించే క్రమంలో సరస్వతీదేవి విగ్రహానికి నష్టం వాటిల్లిందని స్థల యజమానులు తెలిపారు. అంతేతప్ప విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ప్రచారం అవాస్తవం. -
మరి మతం మారితే అభ్యంతరమేల?
దేశంలో ఇతర మతాల్లోని స్త్రీల కంటే క్రిస్టియన్ మహిళలే ఉద్యోగ అవకాశాల్లో ముందంజలో ఉన్నారని ఒక ఆరెస్సెస్ మేధో బృందం తాజా అధ్యయనంలో కనుగొన్నది. క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది. ప్రపంచంలోని ఏ మతం కంటే క్రిస్టియన్ మహిళలు నేడు మరింత స్వేచ్చగా, స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఆరెస్సెస్ కూడా ఈ వాస్తవాన్ని నిష్పక్షపాతంగా అంగీకరించింది. మరి, ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకొనే మతపర స్వాతంత్య్రాన్ని ఆరెస్సెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అలా కాకుండా పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు ఎలాంటి నియంత్రణలూ లేకుండా మత స్వేచ్చను అనుభవించడానికి ఆరెస్సెస్ అనుమతించాలి. భారత్‌లో అమలులో ఉన్న అన్ని మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశంలోని మహిళల అభివృద్ధిపై రాష్ట్రీయ స్వయం సేవక్ మేధో బృందం 2019 సెప్టెంబర్ 19న విడుదల చేసిన ఒక చిన్న నివేదికను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డాను. పుణేకి చెందిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మతపరంగా చూస్తే క్రిస్టియన్ మహిళలు అత్యధిక శాతం ఉద్యోగాలు చేస్తుంటే, హిందువులు, బౌద్దులు, ముస్లింలు, జైన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారని, ఉద్యోగితా శాతం సిక్కు మహిళల్లోనే అత్యంత తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది (ది హిందూ). కానీ మతంవారీగా మహిళల విద్య గురించి అది ఏమీ చెప్పలేదు. ఉద్యోగితా శాతం ఎక్కువగా ఉంది అంటే వారు అక్షరాస్యత, విద్యలోనూ ముందంజలో ఉన్నట్లే కదా? అయితే ఇతర మతాల మహిళలతో పోలిస్తే క్రిస్టియన్ మహిళలే ఎక్కువ అక్షరాస్య తను కలిగి ఉన్నారని 2011 జనాభా లెక్కల డేటా చెబుతోంది. దాని ప్రకారం క్రిస్టియన్ మహిళల్లో నిరక్షరాస్యులు 28.03 శాతం ఉండగా, హిందూ మహిళల్లో 44.02 శాతం, ముస్లిం మహిళల్లో 48.1 శాతం, బౌద్ద మహిళల్లో 34.4 శాతం నిరక్షరాస్యులుగా ఉన్నారు. విగ్రహారాధన కేంద్రంగా మనుగడ సాగిస్తున్న హిందువుల కంటే ఎక్కువగా, ఖురాన్ పఠనం కేంద్రంగా ఉండే మతం పరిధిలో జీవిస్తున్న ముస్లింలు తమ మహిళలను నిరక్షరాస్యులుగా ఉంచే యడం ఆశ్చర్యం కలిగించదు. మన దేశంలో మహిళల అక్షరాస్యత, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన ప్రశ్నలు ప్రభుత్వం లేక పౌర సమాజం సమస్యలుగా కాకుండా మత–సాంస్కృతిక సమ స్యలుగా ఉంటున్నాయి. క్రిస్టియన్ మతంలో స్త్రీ–పురుషుల మధ్య ప్రజాస్వామిక సంబంధాలు ఇతర మతాలతో పోలిస్తే మరింత అభి వృద్ధి అనుకూల తత్వంతో ఉంటున్నాయని ఆరెస్సెస్ మేధో బృందం అధ్యయనం, జనాభా లెక్కల డేటా తేటతెల్లం చేస్తున్నాయి. ఆధ్యా త్మిక రంగంతోపాటు సమాజంలోని అన్ని రంగాల్లో స్త్రీ–పురుష సమా నత్వాన్ని ఏ మతమైనా ప్రసాదించకపోతే, జాతీయ అభివృద్ధితో అధి కంగా ముడిపడివుండే మహిళల పురోగతిని అది తీవ్రంగా అడ్డు కుంటుంది. మహిళలు, నల్లజాతి వంటి మైనారిటీలు విద్యను పొంది, పురుషులతో పోటీపడుతూ ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత పాశ్చాత్య క్రిస్టియన్ ప్రపంచం సత్వర దిశలో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధిని వారు ఆధ్యాత్మిక ప్రజాస్వామిక ఆవరణలో కూడా ఉపయోగించారు. ప్రత్యేకించి ప్రతిభ ఆధారంగా సాగే ఉద్యోగిత పెరిగాక, స్త్రీల శక్తి సామర్థ్యాలను తలుపు వెనుక దాచి ఉంచడాన్ని విశ్వసిస్తూ వచ్చిన సమాజాలు, దేశాల కంటే.. తమ మహిళలను తలుపుల వెనుక దాచి పెట్టని, వారి లైంగికతను వాస్తవమైనదిగా, తమకు తామే నిర్వహిం చుకునేదిగా విశ్వసించిన సమాజాలు.. ప్రపంచంలో ఎక్కువగా అభి వృద్ధి చెందుతూ వచ్చాయి. స్త్రీ శరీరాన్ని కేవలం లైంగిక వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా చూస్తూవచ్చిన పురుష కేంద్రక మతాలు ఇప్పటికీ అత్యంత వెనుకబాటుతనంలో ఉండిపోయాయి. హిందూ వర్ణధర్మ వ్యవస్థ (బాల్య వివాహం, సతి, శాశ్వత వైధవ్యం), సంస్క రణకు నోచుకోని ప్రస్తుత ముస్లిం సమాజాలు దీనికి చక్కటి ఉదాహ రణలు. ఈ సమాజాల్లో కుటుంబ, సామాజిక అభివృద్ధిని అణచిపెట్టే మగాడి గృహ పరిధిలోనే మహిళలను ఉంచేశారు. భారత్‌లో చాలావరకు క్రైస్తవులు అంటే దళిత ఆదివాసులే. క్రిస్టియన్ మతంలోకి మతమార్పిడులు చాలావరకు మహిళల చొర వతో జరుగుతున్నవేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల విద్య ప్రతి తల్లికీ చోదకశక్తిగా ఉంటూ వస్తోంది. దళిత ఆదివాసీలుగా ఉంటున్నప్పటికీ వారి మహిళలు మాత్రం బాగా చదువుకున్నారు, చక్కగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కేథలిక్ సంస్థాగత సంప దను మినహాయిస్తే దళిత క్రిస్టియన్ కమ్యూనిటీలో పెట్టుబడి సంచ యనం, భూ సంపద రూపంలో పెద్దగా సంపద కూడనప్పటికీ, సగటు కుటుంబ వ్యక్తిగత ఆస్తి తక్కువగానే ఉన్నప్పటికీ వీరు చాలా వరకు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు. వీరి సామాజిక సంబంధమైన వాణిజ్యం తక్కువగానే ఉన్నప్పటికీ అది సామూహికం గానే పంపిణీ అయ్యేది. అందుబాటులో ఉన్న వనరుల పంపిణీ అనేది ఇతర కమ్యూనిటీల కంటే క్రిస్టియన్ కమ్యూనిటీల్లోనే ఎక్కువ గానే ఉంటోంది. మతం ఏదైనప్పటికీ ఉత్తమమైన మహిళా విద్య, ఉద్యోగితా వనరులే సామూహిక జాతీయ వనరుగా ఉంటాయి. కానీ తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునేటటువంటి మతపరమైన స్వాతంత్య్రాన్ని ఆర్ఎస్ఎస్ శక్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? క్రిస్టియన్లలో ఎక్కువమంది బలవంతంగా మతమార్పిడీకి గురయిన వారే అయితే భారతీయ క్రిస్టియన్ మహిళలు సాధించిన ఉత్తమ విద్య, ఉత్తమ ఉద్యోగ స్థితి గురించి ఆరెస్సెస్ ఏం చెబు తుంది? పైగా ఆరెస్సెస్ స్వయంగా ఈ నిజాన్ని ఇప్పుడు అంగీకరిస్తోంది కూడా. చారిత్రకంగా అత్యంత అణచివేతకు గురైన కులాల్లోంచి వచ్చినప్ప టికీ క్రిస్టియన్ మహిళలు ఎలా ముందంజ సాధించారు, హిందూ, ముస్లిం మహిళలు మాత్రం ఇప్పటికీ వెనుకబాటుతనంలోనే ఎలా ఉండిపోతున్నారు అనే సైద్ధాంతిక ప్రశ్నను మనం సంధించాల్సిందే. మతపరమైన, ఆర్థిక పరమైన అభివృద్ధి సూచికలపై చైనా నిర్వ హించిన తాజా అధ్యయనాలను పరిశీలిస్తే బౌద్ధులు, కన్ప్యూసి యన్లతో పోలిస్తే అభివృద్ధిలో క్రిస్టియన్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని చూపుతున్నాయి. అంటే, ఆధ్యాత్మికంగా మరింత ప్రజాస్వా మికంగా ఉండే మతమే సామాజిక, ఆర్థిక ప్రజాతంత్ర భాగస్వామ్యా నికి అధికంగా వీలు కల్పిస్తూ.. వ్యక్తులు, కుటుంబాలు మెరుగైన జీవి తం గడిపేందుకు అవకాశాలు కల్పిస్తోంది. అందుకే చైనా ఇప్పటికీ మతపరమైన అణచివేత స్వభావంతో ఉంటున్నప్పటికీ, దేశంలో జరుగుతున్న మత మార్పిడులను మరొక దృష్టితో చూడటం మొద లెట్టింది. మహిళల స్వాతంత్య్రం, వారి విద్య, శ్రమను గౌరవించడం అనే స్పష్టమైన వైఖరితో వేగంగా పెరుగుతున్న వారి ఉద్యోగిత, తమ లైంగికతపై పూర్తి నియంత్రణను మహిళలే కలిగి ఉండేలా అనుమ తించడం అనేవి మహిళల అభివృద్ధికి, అలాగే జాతి అభివృద్ధికి కీల కమైన సాధనాలు. ఈ పరామితులలో భారతీయ క్రిస్టియన్లే ఉన్నత స్థానంలో ఉన్నారని ఆరెస్సెస్ ఇప్పుడు తెలుసుకుంది. అలాంట ప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలను ఎందుకు తీసుకువస్తున్నారు? నిర్బంధ మతమార్పిడి పేరుతో వారి చర్చిలపై, మత సంస్థలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? మహిళలు అన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బతకగలుగు తున్న క్రిస్టియానిటీలాగా హిందూమతం మారాలని ఆరెస్సెస్ కోరు కుంటున్నట్లయితే, స్త్రీ–పురుష సంబంధాల విషయంలో అది పూర్తిగా తన వైఖరిని మార్చుకోవల్సి ఉంది. హిందూయిజంలోని అన్ని నిర్మా ణాలూ మహిళలను తమలో భాగం చేసుకోవాల్సి ఉంది. అలాగే భారతీయ ముస్లింలు కూడా భారతీయ ఇస్లాం పద్ధతుల్లో, మహిళా స్వాతంత్య్రం.. ప్రత్యేకించి స్త్రీల విద్య, ఉద్యోగిత విషయంలో భారీ సంస్కరణలు తీసుకురావడంపై తప్పక ఆలోచించాలి. మరే ఇతర మతాలకంటే ఈరోజు ముస్లిం మహిళలు పూర్తిగా పురుషుల నియం త్రణకు గురవుతున్నారు. ఆధ్యాత్మిక రంగంలో వారికి స్థానం లేక పోవడం, ఇంటికి పరిమితం చేయడం వల్ల ఇతర మతాల స్త్రీలకు మల్లే ముస్లిం మహిళలు పోటీ మార్కెట్లోకి ప్రవేశించలేకున్నారు. పోటీకి స్వాతంత్య్రం అవసరం. బహుళ సాంస్కృతిక లేదా బహుళ మతాలతో కూడిన మంచి సమాజం అన్ని మతాల మహిళలకూ మార్కెట్లో సానుకూల పోటీకి అనుమతించాలి. ఈ క్రమంలో మహి ళలు తమ తమ మతాలకు చెందిన అనేక చట్టాలను సవాల్ చేయాల్సి ఉంటుంది. మతాలు కూడా ఈ మార్పులకు అవకాశం ఇవ్వాలే తప్ప భూస్వామ్య యుగ చట్టాలతో మహిళలను నిర్బంధించకూడదు. ఒక మతంగా క్రిస్టియానిటీ అనేక చెడు నిబంధనలను అమలు పరుస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా స్త్రీ– పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను అది దాటుకుంటూ వచ్చింది. ప్రపంచం లోని ఏ మతం కంటే క్రిస్టియన్ మహిళలు నేడు మరింత స్వేచ్చగా, లైంగిక నియంత్రణలకు పెద్దగా లోబడకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఆరెస్సెస్ కూడా సమగ్రమైన ఫీల్డ్ వర్క్‌తో చేసిన సర్వే ద్వారా వాస్తవాన్ని పక్షపాతం లేకుండా అంగీకరించింది. కాబట్టి పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు ఎలాంటి నియంత్రణలూ లేకుండా మత స్వేచ్ఛను అనుభవించడానికి ఆరెస్సెస్ అనుమతించాలి. ఇస్లాంతో సహా మరేమతంలోనూ ఇలా మతమార్పిడి ఎందుకు జరగ లేదన్న విషయంపై వారు ఆలోచించాలి. అందుకే భారత్‌లో అమ లులో ఉన్న అన్ని మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
వివేక వాణి
ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు. కానీ, దేవుణ్ణి బొమ్మగా భావించకూడదు. అదేవిధంగా ప్రతిమలో భగవంతుడున్నాడని తలచడం తప్పుకాదు. భగవంతుడు ప్రతిమ అనుకోవడం తప్పు.గ్రంథాల వల్ల మతాలు రూపొందడం లేదు. కానీ, మతాలు గ్రంథాలకు కారణమవుతున్నాయి. ఈ సంగతి మనం విస్మరించకూడదు. ఏ గ్రంథమూ భగవంతుణ్ణి సృష్టించలేదు. భగవంతుడే అనేక ఉద్గ్రంథాల రచనకు దివ్యప్రేరణ కలిగించాడు. -
ముస్లింలు కళ్లకు ‘సుర్మా’ ఎందుకు పెడతారు?
సాక్షి, సిటీబ్యూరో : రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా సుర్మా వాడతారు. కాటుకలా కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో నల్లగా ఉంటుంది. ఇది కళ్లకు కొత్త అందాన్ని తీసుకొస్తుంది. కంటికి తేజస్సును ఇవ్వడంతో పాటు చలువదనాన్ని అందజేస్తుంది. అందుకే ఈ మాసంలో ఎక్కువగా సుర్మాను వినియోగిస్తారు. ప్రవక్త మూసా తొలిసారి దీనిని వాడారు. అరబ్ దేశంలోని మరాఖిష్ ప్రాంతంలోని కోహితూర్ పర్వతం భస్మం కావడంతో భూమి నల్లగా మారిందని, అక్కడికెళ్లిన ప్రవక్త మూసా ఆ నల్లటి పౌడర్‌ను కళ్లకు పెట్టుకున్నారని మత పెద్దలు చెబుతారు. తర్వాత మహ్మద్ ప్రవక్త కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రంజాన్ మాసంలో ప్రతిరోజు రెండు కళ్లకు సుర్మా పెట్టుకుంటారు. ఇలా తయారీ... నల్లని రాళ్లను పగులగొట్టి, పౌడర్‌గా మారుస్తారు. దీనికి గులాబీ నీరు కలిపి సుర్మా తయారు చేస్తారు. పాతబస్తీకి చెందిన సయ్యది సుర్మాకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాతముత్తాతల కాలం నుంచి తాము ఈ వ్యాపారం కొనసాగిస్తున్నామని చెప్పారు పత్తర్‌గట్టీలోని సయ్యది సుర్మా వ్యాపారి సయ్యద్ జహీరుద్దీన్ ఖాద్రీ. -
సైన్యం అన్ని మతాలను స్వాగతిస్తుంది
-
మత మార్పిడి ముఠా గుట్టు రట్టు
ఉప్పల్: విద్యార్థులను మతమార్పిడికి పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.ఇందుకు సంబంధించి మల్కాజిగిరి ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏసీపీ సందీప్‌రావు, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జానకిరెడ్డితో కలిసి వెల్లడించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిద్దిఖి అలియాజ్ సత్యనారాయణ నగరంలోని నాదర్గుల్ మెగా డ్రీమ్ సిటీలో నివాసం ఉంటున్నాడు. ముందు క్రిస్టియన్గామారి ఆ తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. కొందరికితో కలిసి ముఠాగా ఏర్పడి పీస్ అర్బన్ హోమ్ సొసైటీని ఏర్పాటుచేసుకున్నారు. చిన్నారులకు విద్య నేర్పుతామంటూ ప్రచారం చేసేవారు. మహబూబ్‌నగర్, సూర్యాపేటలతో పాటు వెనుకబడిన ప్రాంతాలలో 4–14 సంవత్సరాలలోపు గల ఎస్సీ, ఎస్టీ బాలబాలికలను ఎంపిక చేసుకొని ఉచితంగా చదువు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. మొదట్లో ఎర్రకుంటలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకొని తరువాత రెండు నెలల క్రితం మౌలాలిలోకి స్కూల్‌ను మార్చారు. అయితే అక్కడ విద్యార్థులను బలవంతంగా మతానికి సంబంధించిన విషయాలు చెబుతూ మతమార్పిడికి యత్నిస్తున్నారని చైల్డ్ సొసైటీ నిర్వాహకులుఫిర్యాదు చేశారు. దీంతో దాడిచేసి 10 మంది బాలురు, 7 మంది బాలికలను అదుపులోకి తీసుకొని చైల్డ్ హోమ్‌కు తరలించారు. మతమార్పిడిలకు పాల్పడుతున్న ముఠాలోని 9 మంది సభ్యులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఒక్కరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పవిత్ర ప్రేమకు ‘మతం’ అడ్డు
తల్లిదండ్రులు సమ్మతించినా అడ్డుపడుతున్న కులసంఘాలు బైక్ ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న మండ్య పోలీసులు ప్రేమికులకు మద్దతుగా ‘ప్రగతిపర వేదిక’ బెంగళూరు: వారి ప్రేమకు మతాలు అడ్డంకి కాలేదు. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ ఇద్దరూ కెరీర్లో స్థిరపడ్డాక తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాలు వివాహానికి సమ్మతించడంతో ఆ కుటుంబాల్లో, ప్రేమికుల హృదయాల్లో ఆన ందోత్సాహాలు వెల్లివిరుస్తున్న వేళ కులసంఘాలు వారి ప్రేమకు అడ్డుపడుతున్నాయి. ఆ ప్రేమికులది నిజమైన ప్రేమకాదని, ప్రేమ పేరిట జరుగుతున్న లవ్‌జిహాది అని గోలపెడుతున్నాయి. వీరి పెళ్లి ఎట్టిపరిస్థితుల్లోనూ జరగరాదని మండ్యలోని ఒక్కలిగర సంఘానికి చెందిన కార్యకర్తలు శుక్రవారం మండ్య నగరంలో బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. దీంతో ఆ ప్రేమజంట ఒక్కటయ్యేందుకు ‘మతం’ అడ్డుగోడగా మారుతోంది. 12 ఏళ్ల ప్రేమ...... మండ్య నగరంలోని అశోకనగర్‌లోని రెండవ క్రాస్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ హెచ్,వి.నరేంద్రబాబు, గాందీనగరలో నివాసం ఉంటున్న బియ్యం వ్యాపారి ముఖ్తార్ ఆహ్మద్‌లు ఇద్దరు బాల్య స్నేహితులు. దాంతో నరేంద్రబాబు కుమార్తె అశితా, ముఖ్తార్ అహ్మద్ కుమారుడు షకిల్ చిన్నప్పటి నుంచి ఎంబీఎ వరకు కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు 12 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దాంతో ఇరు కుటుంబాల వారు ఇద్దరి పెళ్లికి కూడా ఒప్పుకొని ఈ నెల 17న మైసూరు నగరంలోని తాజ్ కన్వెన్షన్ హాల్లో పెళ్లి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘటణ కార్యకర్తలు గత మంగళవారం యువతి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ప్రేమ పేరిట హిందూ యువతిని ముస్లిం మతంలోకి మార్చి లవ్ జిహాదికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. అయితే ఇందులో లవ్ జిహాది లాంటిదేదీ లేదని, తమ బిడ్డలు వివాహానంతరం కూడా మతం మారబోరని ఇప్పటికే ఇరు కుటుంబాలు ప్రకటించాయి. అయినప్పటికీ మండ్యలోని కొన్ని సంఘాలు, ఒక్కలిగర సంఘం సభ్యులు ఈ వివాహాన్ని అడ్డుకోవాలని కోరుతూ బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బైక్ ర్యాలీకి బయలు దేరిన 15 మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శనివారం మండ్య బంద్‌కు సైతం ఈ సంఘం సభ్యులు పిలుపునిచ్చాయి. ఇదే సందర్భంలో మండ్యలోని కొన్ని ప్రగతిపర సంఘాలు మాత్రం ఈ ప్రేమ జంట వివాహానికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ప్రేమ జంటకు తాము అండగా ఉంటామని చెబుతూ వారు సైతం మండ్యలో శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. మమ్మల్నిలా వదిలేయండి... ఇక ఈ విషయంపై అశితా స్పందిస్తూ....‘మమ్మల్నిలా వదిలేయండి. మేమిద్దరం 12 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. కెరీర్లో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాం. ఇందులో నిజమైన ప్రేమ తప్పితే మరే విషయం లేదు. మా పెళ్లైన తర్వాత అత్తగారింట్లో రమ్జాన్ జరుపుకుంటాను, పుట్టింట్లో రామనవమి జరుపుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని పేర్కొన్నారు. -
'కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారు'
హైదరాబాద్: పరస్పరం గౌరవించుకోవడం హైదరాబాద్ సంప్రదాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన 'ది స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తుందన్నారు. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆయన తెలిపారు. దేశంలో ఉన్న నాలుగు మెట్రో నగరాలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్‌ను ఏ ఒక్క వ్యక్తి అభివృద్ధిచేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు హైదరాబాద్ సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉందన్నారు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో అభివృద్ధిపైనే దృష్టి పెడతామన్నారు. -
దేవునికి మతం ఉందా?
శరీర ఎదుగుదలకు మానవునికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మ బలపడడానికి ఆధ్యాత్మికత అంతే అవసరం. శారీరక ఆరోగ్యం గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. జిహ్వ చాపల్యం కారణంగా కోటానుకోట్ల వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిత్యం తయారవుతూనే ఉన్నాయి. కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, రచనలు, ప్రబోధాలు, భజనలు, వాటి స్ఫూర్తితో చేసే మంచి పనులు... ఇవన్నీ ఆధ్యాత్మి ఆహారాలే. శారీరక రగ్మతలను అధిగమించడానికి శారీరక దృఢత్వం దోహదపడుతుంది. అలాగే కనిపించని సమస్యలను, మానసిక ఒత్తిళ్లను జయించడానికి ఆధ్యాత్మిక బలం అవసరం. నేడు మనం ఎదుర్కొనే శారీరక సమస్యల కన్నా, మానసిక సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకత్వమే.ఇది కేవలం మానవునిలో ఆధ్యాత్మిక బలం తగ్గిపోవడం వల్లనే. మతాలు వేరయినా, మానవజాతి ఒక్కటే. అన్ని మతాలూ మంచినే బోధిస్తాయి. దేవునికంటే మతమేదీ లేదు. నాది ఫలానా మతం అని దేవుడు ఎన్నడూ, ఎవరితోనూ చెప్పలేదు. ఏ మతగ్రంథంలోనే అలా అని రాసి లేదు. దేవుడు నిజానికి, మతాలకు అతీతంగా మానవ జాతినంతటినీ ప్రేమిస్తున్నాడు. మతాన్ని బట్టి కాక, వారి నిష్కల్మషమైన హృదయాన్ని బట్టి దేవుడు వారిని ప్రేమిస్తాడు. కాబట్టి ఒకరినొకరు మతం పేరిట నిందించుకోకుండా, సత్యాన్ని గ్రహించి, ఒకరి పట్ల ఒకరు సమాధానంగాను, దేవుని పట్ల భక్తిగానూ మెలిగినప్పుడు ఈ భూలోకమే స్వర్గంగా మారుతుంది. అలాగైతే స్వర్గాన్ని మరణానంతరమే కాకుండా జీవించి ఉండగానే వీక్షించవచ్చు. - యస్.విజయభాస్కర్ -
నడుపల్లిలో సాకారమైన జాతిపిత ఆశయం
అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఇంటిలోకి దళితుల గృహ ప్రవేశం సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేసిన ఇంటి యజమాని కోలారు : కులాలు, మతాలు, జాతుల మధ్య అడ్డుగోడలు ఉండరాదనే గాంధీజీ ఆశయం సాకరమైంది. తాలూకాలోని నడుపల్లి గ్రామంలో ఆగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి దళితులను తన ఇంటిలోకి ఆహ్వానించి మనుషులందరిదీ ఒకే కులమని చాటారు. అనాదిగా ఇంటి బయటి నుంచే పలుకరిస్తున్న దళితులను తన ఇంట్లోకి ఆహ్వానించారు. కోలారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షుడు క్రిష్ణమూర్తి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న వెంకటేష్, మెణసమ్మ, మునిరత్న దళిత కుటుంబాలను తన ఇంటిలోకి ఆహ్వానించి వారికి తగిన గౌరవ మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లా కళాశాల లెక్చరర్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ అస్పృశ్యత పట్టణాలలో కంటె గ్రామీణ ప్రాంతాలలోనే అధికంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయి నుంచే దీనిని అడ్డుకోవాలన్నారు. దళిత నాయకుడు విజయకుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు కమ్యూనిస్టు సిద్దాంతాల పట్ల నమ్మకం ఉన్నవారు ముందుకు రావాల్సి ఉందన్నారు. కానీ వారు తమ నోటి వెంట దళితులు మా ఇంటికి రండి పిలవలేదని విచారం వ్యక్తం చేశారు. -
వివేకాన్ని ఉపయోగించాలి
వెలుగు బాట మంచిని, మానవత్వాన్ని బోధించడమే అన్ని మతాలు చేయవలసిన పని. ద్వేషభావాన్ని నూరిపోసే మతాలు అసలు మతాలేకావు. ఇతరులను, ఇతర మతధర్మాలను ద్వేషించేవి, దూషించేవి, మతం అనిపించుకునే అర్హతను కలిగి ఉండవు. నాస్తికుల మాటల్లో చెప్పాలంటే, అలాంటి మతాలు నిజంగా మత్తుమందుతో సమానం. కాదు ఇంకా అంతకన్నా ఎక్కువే. నిన్ను వలె నీపొరుగు వారిని ప్రేమించమన్నారు ఏసుక్రీస్తు. సర్వేజనా సుఖినోభవంతు అంటుంది హిందూ మతం. ‘నువ్వు నీకోసం ఏ స్థితిని కోరుకుంటావో, నీతోటి వారి కోసం కూడా అలాంటి స్థితినే కోరుకో’మన్నారు మహమ్మద్ ప్రవక్త (స). సమస్త మానవాళీ పరస్పరం సోదరులే. అందరినీ ప్రేమించండి. పరుల ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం, అది పాపం, అది నరకం అంటోంది ఇస్లాం ధర్మం. కనుక పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందరూ నిష్పక్షపాతంగా ఒకరి మత ధర్మాలను ఒకరు అధ్యయనం చెయ్యాలి. అవగాహన పంచుకోవాలి. మత ధర్మాల్లో చెడుకు అవకాశమే ఉండదు కాబట్టి అందులోని మంచిని గ్రహించాలి. దాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఎందులోనైనా వైర, విద్వేష బోధనాలున్నట్లయితే అది మతం కాదని గ్రహించాలి. వెంటనే దాన్ని విసర్జించాలి. అంతేగాని దాన్ని అనుసరించకూడదు. స్వార్థ, మత ఛాందస బోధకుల మాయమాటలకు లొంగకుండా ఉండేందుకు సైతం అధ్యయనం అవసరమవుతుంది. గుడ్డిగా ఎవరి మాటలూ వినకూడదు. దైవం మనకు ప్రసాదించిన వివేకం, విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి ఆలోచించాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి, సామరస్య వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని అల్లకల్లోలానికి గురిచేసి, అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అలాంటి శక్తుల ఉచ్చులో పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్ని సత్కార్యాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ కూడా ఇలా చెబుతుంది. ‘మంచికి, దైవభక్తికి సంబంధించిన పనుల్లో అందరితోనూ సహకరించండి. పాపకార్యాల్లో అత్యాచారాల్లో ఎవ్వరితో సహకరించకండి, దైవానికి భయపడండి, దైవభక్తి పరాయణతకు ఇది నిదర్శనం’ (పవిత్ర ఖురాన్) - మహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఎలాగూ చనిపోతాం... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది!
రామ్‌గోపాల్ వర్మ... ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం. మరి, అలాంటి విలక్షణ వ్యక్తి ఎవరిని చూసి ప్రభావితమయ్యారు? దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు? ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే ఈ మనిషికి బతుకు మీద భయం లేదా? రండి... రామూను అడిగేద్దాం... ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం. అతని తెలివితేటల ముందు నేనో పురుగులా అనిపించేవాణ్ణి! నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు. ‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి. అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి. ‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి. నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే! సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ - నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది. తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే. ఆ సినిమాల జాబితా చాలా పెద్దది! ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది. నాకెప్పుడూ, దేనికీ భయం లేదు! అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
నేరం - మతం - పచ్చి అవకాశవాదం
ఢిల్లీ: మైనార్టీల కేసుల ఎత్తివేతపై కమిటీ ఏర్పాటు చేస్తామనడం పచ్చి రాజకీయ అవకాశవాదం అని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. నేరస్తుల పట్ల మతాలకు అతీతంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఎప్పుడు పెడతారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు బేషరతుగా బీజేపీ మద్దతు తెలుపుతుందని చెప్పారు. తిరుమలలో సామాన్య భక్తులకు శఠగోపం పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ సిబ్బంది వీఐపీల సేవలో మునిగితేలుతున్నారని విమర్శించారు. సామాన్యులకు గోవింద దర్శనం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
రెండు సంప్రదాయాల జోడి... నిండు హృదయాల సవ్వడి
నవ్వుల హాసిని ‘జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కిందటేడాది ఫిబ్రవరి 3న దంపతులయ్యారు. ఇద్దరి మతాలు వేరు. కుటుంబ నేపథ్యాలు వేరు. దీంతో మొదట ఇరువైపు పెద్దలు ససేమిరా అన్నారు. అయినా ఎవరినీ నొప్పించకుండా ఒప్పించి ఒక్కటైన ఈ జంట విశేషాలే ఈ మనసే జతగా! ప్రేమికులుగా ఉన్నప్పుడు కులాలు, మతాలు అడ్డు రావు. కాని పెళ్లి అనగానే ఎవరి సంప్రదాయాలు వారికి గుర్తుకు వస్తాయి. పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని కొంతమంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు తమ ప్రేమను తమలోనే దాచుకుని కుమిలిపోతుంటారు. కొందరు మాత్రమే ధైర్యంగా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించి మరీ జంటకడతారు. ఈ వరసలోనే చేరుతారు 26 ఏళ్ల జెనీలియా డి సౌజా, 35 ఏళ్ల రితేష్ దేశ్‌ముఖ్‌లు. రితేష్ సినిమాల్లోకి రాకముందు ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ్జకుమారుడు. అప్పటికి జెనీలియా మోడల్! రితేష్ 2003లో తుఝే మేరీ కసమ్ సినిమాలో నటించడానికి ఓకే చేశారు. కో స్టార్ జెనీలియా! ఇద్దరికీ అది మొదటి సినిమా. ఆ సినిమాతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా వీరి అనుబంధం మాత్రం పెద్ద హిట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరికి వారు కెరియర్లో బిజీగా ఉంటూనే తమ మధ్య ఆత్మీయతను పెంచుకున్నారు. అనుబంధానికే ప్రాముఖ్యం జెనీలియా: రితేష్‌తో ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మా మధ్య ప్రేమ చిగురించిందని తెలిశాక ఇరువైపు కుటుంబాల వారికి చెప్పాం. అయితే రితేష్ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో ఎనిమిదేళ్లపాటు వారి అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రితేష్ చాలా కష్టపడ్డారు. మా మధ్య బంధం మొదలైన నాటి నుంచి వారి ఇంట్లో చెబుతూనే ఉండేవారు. నేనూ అంతే! అమ్మనాన్నలకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉండేదాన్ని. మా మధ్య దీర్ఘకాలంగా కొనసాగిన ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి ఓకే చేశారు. అంతే! మా ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఇరువైపులవారికి నచ్చినట్టుగా రెండు మతాల పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా మా ఇంట్లో వారికి నచ్చినట్టుగా చర్చిలోనూ, రితేష్ ఇంట్లో వారికి నచ్చినట్టుగా మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలోనూ మా పెళ్లి అయ్యింది. రితేష్ పెద్ద అన్నయ్య టీవీ నటి అదితి ప్రతాప్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అదితి నటనకు ఫుల్స్టాప్ పెట్టేసింది. దాంతో నేనూ అలాగే నా నటనకు స్వస్తి చెబుతానని చాలా మంది అనుకున్నారు. కాని రితేష్ మాత్రం ఆ నిర్ణయం నాకే వదిలేశారు. అందుకే ఇంకా సినిమాల్లో నటిస్తున్నాను. నేను రితేష్ కలిసి గుళ్లు, గోపురాలు సందర్శిస్తుంటాం. అలాగే చర్చ్‌కీ వెళుతుంటాం. మా పెళ్లయిన కొద్దిరోజులకే ముంబైలో మంచి ఫ్లాట్ కొనుక్కున్నాం. మేం ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దగ్గర ఉండి డిజైన్ చేయించారు రితేష్! దేవుడికి నేను చాలా ఇష్టమైన బిడ్డను అని నమ్ముతాను. అందుకే నా జీవితం ఇంత బాగుంది. నాకే చిన్న సమస్య వచ్చినా దేవుడితోనే ముందు చెప్పుకుంటాను...’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ, ఎంతో సంబరంగా చెబుతారు ఆమె! విలువ తెలిపిన బంధం రితేష్: మా పెద్దలు పెళ్లికి ఒప్పుకోనప్పుడు జీవితాంతం స్నేహితులుగానే ఉందామని చెప్పింది జెనీలియా! పెద్దల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల మన్నన ఉన్న వ్యక్తి తను. ఆమె నా జీవితంలోకి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. నా పుట్టినరోజు కూడా కిందటి వారమే (డిసెంబర్ 17). క్రిస్ట్మస్ కూడా ఈ నెలలోనే! దీంతో మా ఇంట రెండు పండుగల సందడి ఉంటుంది. అంధేరిలోని సెయింట్ క్యాథరీన్ హోమ్ బాలల మధ్య కిందటేడాది క్రిస్ట్మస్ వేడుకలు జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి’ అంటూ ఆనందంగా వివరిస్తారు రితేష్! ఇద్దరూ సెలబ్రిటీలు. కాంట్రవర్సీ కామన్! సమస్యలూ సహజమే! అయినా ప్రేమను కాపాడుకోవడానికి పెద్దలను ఒప్పించిన ఈ జంటకు అవన్నీ దూదిపింజెల్లాంటివే! పెళ్లయ్యాక నా నటనకు ఫుల్స్టాప్ పడుతుంది అన్నారంతా! కానీ రితేష్ మాత్రం ఆ నిర్ణయాన్ని నాకే వదిలేశారు. - జెనీలియా జెనీలియా నా జీవితంలో కి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. - రితేష్