హైదరాబాద్: పరస్పరం గౌరవించుకోవడం హైదరాబాద్ సంప్రదాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్క్హయత్ హోటల్లో జరిగిన 'ది స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తుందన్నారు. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆయన తెలిపారు.
దేశంలో ఉన్న నాలుగు మెట్రో నగరాలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ను ఏ ఒక్క వ్యక్తి అభివృద్ధిచేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు హైదరాబాద్ సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉందన్నారు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో అభివృద్ధిపైనే దృష్టి పెడతామన్నారు.
'కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారు'
Published Sun, Jan 31 2016 11:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement