
కుప్పం రూరల్: ఇంటి ముందు ఆడుకునేందుకు వేసిన ఊయలే ఉరితాడై బాలిక మృతిచెందింది. ఈ సంఘటన కుప్పం మండలం, చిన్నగోపనపల్లె లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు చిన్నగోపనపల్లెకు చెందిన మూర్తి, రమ్యకు నలుగురు కుమార్తెలు. పెద్దమ్మాయి శ్వేత (9). తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. శ్వేత పాఠశాల మూశాక సాయంత్రం ఇంటికెళ్లింది. ఇంటి ముందు చీరతో వేసిన ఊయలో ఆడుకుంటోంది. ఊయల చీర గొంతుకు బిగుసుకుని మరణించింది.
చదవండి:
భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం
మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్ల వీరంగం
Comments
Please login to add a commentAdd a comment