దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన | Heavy Rain Forecast For The South Coast AP | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన

Published Mon, Nov 16 2020 4:36 AM | Last Updated on Mon, Nov 16 2020 4:36 AM

Heavy Rain Forecast For The South Coast AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం : కొమరిన్‌ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతం వరకు వ్యాపించింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో  నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement