ఐదేళ్ల జగన్ పాలనలో భారీగా ఆర్థిక సాయం
నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.43,648.75 కోట్లు
నాన్ డీబీటీ ద్వారా రూ.7,808.81 కోట్లు ప్రయోజనం
వైఎస్సార్ పెన్షన్ కానుకలో 8.75 లక్షల మందికి రూ.11,958.41 కోట్లు
జగనన్న అమ్మ ఒడిలో 5.99 లక్షల మందికి రూ.3,144.81 కోట్లు
పేదలైతే చాలు నవరత్నాలతో అగ్ర వర్ణాలకు వెలుగులు
వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు
కులం, మతం చూడని ఏకైక సీఎం వైఎస్ జగన్
గతంలో వారిని ఏ ప్రభుత్వం పట్టించుకోని వైనం
తొలిసారి సీఎం జగన్ నిర్ణయంతో భారీ మేలు
ఎన్నికల ముందు చంద్రబాబు మోసపూరిత హామీలు
చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయిన అగ్రవర్ణ పేదలు
వారికి మేలు జరగాలంటే మళ్లీ జగన్‌తోనే సాధ్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో కులం, మతం, వివక్ష, అనేది ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదు. ఇందుకు నవరత్నాల ద్వారా పథకాలు పొందిన లబ్ధిదారులే తార్కాణం. పేదలైతే చాలు వారు ఏ కులానికి చెందిన వారైనా ఆఖరికి తనకు ఓటు వేయని వారికి కూడా నవరత్నాల్లో ఆర్థిక ప్రయోజనం కల్పించారు.
ఇందులో భాగంగానే సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనతో అగ్ర వర్ణ పేదలందరికీ భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్ర వర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. తొలిసారిగా సీఎం జగన్ పాలనలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి)రూ.51,457.56 కోట్ల లబ్ధి చేకూర్చారు.
అగ్రవర్ణ పేదలకు ఈ ఐదేళ్లలో అందిన లబ్ధి
⇒ నగదు బదిలీ ద్వారా – రూ.43,648.75 కోట్లు
⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులు – 9,97,728
⇒ వారి ఖాతాలకు జమ అయిన నిధులు – రూ.7,025.42 కోట్లు
⇒ నాన్ డీబీటీ ద్వారా అంటే ఆరోగ్య శ్రీ, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాల భూ సేకరణ వంటి పథకాలకు – రూ.7,808.81 కోట్లు
⇒ నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతవాసులే
⇒ జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించారు.
⇒ మేనిఫేస్టోలో చెప్పిన మేరకు అన్ని అగ్ర కులాలకు (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ) తదితరులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు
⇒ చంద్రబాబు పాలనలో పెన్షన్, రేషన్ కార్డు టీడీపీ వారికే అందేవి.
⇒ ఆ తరువాత కులం ప్రాతిపదికన రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేసేవారు.
⇒ లంచం ఇస్తే తప్ప మంజూరు చేసేవారు కాదు.
Comments
Please login to add a commentAdd a comment