financial aid schemes
-
అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో కులం, మతం, వివక్ష, అనేది ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదు. ఇందుకు నవరత్నాల ద్వారా పథకాలు పొందిన లబ్ధిదారులే తార్కాణం. పేదలైతే చాలు వారు ఏ కులానికి చెందిన వారైనా ఆఖరికి తనకు ఓటు వేయని వారికి కూడా నవరత్నాల్లో ఆర్థిక ప్రయోజనం కల్పించారు.ఇందులో భాగంగానే సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనతో అగ్ర వర్ణ పేదలందరికీ భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్ర వర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. తొలిసారిగా సీఎం జగన్ పాలనలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి)రూ.51,457.56 కోట్ల లబ్ధి చేకూర్చారు. అగ్రవర్ణ పేదలకు ఈ ఐదేళ్లలో అందిన లబ్ధి ⇒ నగదు బదిలీ ద్వారా – రూ.43,648.75 కోట్లు ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులు – 9,97,728 ⇒ వారి ఖాతాలకు జమ అయిన నిధులు – రూ.7,025.42 కోట్లు ⇒ నాన్ డీబీటీ ద్వారా అంటే ఆరోగ్య శ్రీ, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాల భూ సేకరణ వంటి పథకాలకు – రూ.7,808.81 కోట్లు ⇒ నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతవాసులే ⇒ జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించారు. ⇒ మేనిఫేస్టోలో చెప్పిన మేరకు అన్ని అగ్ర కులాలకు (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ) తదితరులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు ⇒ చంద్రబాబు పాలనలో పెన్షన్, రేషన్ కార్డు టీడీపీ వారికే అందేవి. ⇒ ఆ తరువాత కులం ప్రాతిపదికన రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేసేవారు. ⇒ లంచం ఇస్తే తప్ప మంజూరు చేసేవారు కాదు. -
సుకన్య సమృద్ధి యోజనపై తపాలా శాఖ శ్రద్ధ
సాక్షి, అమరావతి: బాలికలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనపై రాష్ట్ర తపాలా శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికా సాధికారత వారోత్సవాల పేరిట ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు అన్ని తపాలా శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అభినవ్ వాలియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చని, ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు బాలికల పేరిట ఖాతాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకం కింద గరిష్టంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుందని, ఈ పథకంలో పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చని వివరించారు. ఏడాదిలో కనీసం రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చన్నారు. మహిళల భవిష్యత్‌కు బలమైన ఆర్థిక పునాది కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
భారత సంస్థలకు గూగుల్ సాయం
Google Impact Challenge Programme: మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ‘ఇంపాక్ట్ చాలెంజ్’ కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థలను గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంపిక చేసింది. ఇందులో భారత్‌కు చెందిన మూడు స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఎంపికైనవి గూగుల్‌కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్ డాట్ ఓఆర్జీ. భారత్ నుంచి సంహిత–సీజీఎఫ్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, స్వ తలీమ్ ఫౌండేషన్ సంయుక్తంగా 2.5 మిలియన్ డాలర్లు (రూ.18.75 కోట్లు) ఆర్థిక సాయాన్ని గూగుల్ డాట్ ఓఆర్జీ నుంచి అందుకోనున్నాయి. ‘‘గూగుల్ ఓఆర్జీ నిర్వహించిన ఇతర ఏ ఇంపాక్ట్ చాలెంజ్‌తో పోల్చినా స్పందన ఎక్కువగా ఉంది. 7,800 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంస్థలన్నీ కూడా.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్లో పురోగతి, ఎంర్ప్రెన్యుర్షిప్, వ్యాపారం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, మద్దతు అనే అంశాలపై దృష్టి సారించాయి’’ అని గూగుల్ డాట్ ఓఆర్జీ ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళలకు చేదోడు.. సంహిత సీజీఎఫ్ ‘రివైవ్ అలయన్స్’ ప్రాజెక్ట్‌కు గూగుల్ డాట్ ఓఆర్జీ నుంచి 8 లక్షల డాలర్ల సాయం లభించనుంది. ఈ నిధితో 10వేల మంది మహిళలకు సాయం అందించే లక్ష్యాన్ని సంహిత పెట్టుకుంది. సంప్రదాయ మార్గాల్లో రుణాలు పొందలేని మహిళలు వారి వ్యాపార అవసరాలు, డిజిటైజేషన్‌పై పెట్టుబడులకు వీలుగా వడ్డీలేని రుణాలను అందించనుంది. వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన రుణాలు ఇవి. ఇలా తిరిగి చెల్లించిన మహిళలు.. సంహిత సీజీఎఫ్ బ్యాంకింగ్, సూక్ష్మ రుణ భాగస్వాముల నుంచి మరింత సాయానికి అర్హత సాధిస్తారని ఈ ప్రకటన తెలియజేసింది. యువతులకు ఉపాధి శిక్షణ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఒక మిలియన్ డాలర్ల సాయాన్ని పొందనుంది. దీని ద్వారా 7,000 మందికిపైగా గ్రామీణ యువతులకు బ్యూటీ, ఆరోగ్య సంరక్షణ, మెకానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో పనిచేసే విధంగా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. 300–500 గంటలపాటు శిక్షణ ఇచ్చి, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అక్రెడిటేషన్ ఇప్పించనుంది. స్వ తలీమ్ ఫాండేషన్ తనకు లభించే 7 లక్షల డాలర్ల సాయంతో గ్రామీణ మహిళలు, ఆడపిల్లలకు టెక్నాలజీ పెద్దగా అవసరం లేని స్పీకర్ ఫోన్లు తదితర మార్గాల ద్వారా మ్యాథ్స్, సైన్స్, ఆర్థిక అవగాహన తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. - న్యూఢిల్లీ -
‘పీఎం కిసాన్’కు ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులకు తోడ్పాటు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ గుర్తింపు కార్డు కింద ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి నెలలో ఇచ్చే తొలి విడతలో మాత్రం ఇది ఐచ్ఛికమేనని (ఆప్షనల్) పేర్కొంది. తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం లేఖ రాసింది. పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. రైతుకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆ భూములన్నింటిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే పీఎం కిసాన్ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో నోడల్ యూనిట్లను, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. -
క్రీడాకారులకు అందని ఆర్థిక భరోసా..!
విజయనగరం మున్సిపాలిటీ: మట్టిలో మాణిక్యాలకు ఆర్థిక భరోసా కరువవుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించేవారి పౌష్టికాహారం కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) డే బోర్డర్స్ పథకం పేరిట ప్రతి నెలా అందించే ఆర్థిక సాయం అందకపోవడమే నిదర్శనం. 13 క్రీడాంశాల్లో రాణిస్తున్న పేద క్రీడాకారులను గుర్తించి డే బోర్డర్ పథకం అమలు చేయాలని గతేడాది మార్గదర్శకాలు జారీ చేయగా... క్రీడాకారులను గుర్తించి, వారిని ఎంపిక చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు క్రీడాంశాల్లో మాత్రమే క్రీడాకారులను ఎంపిక చేశారు. ప్రోత్సాహం లేకుంటే ఎలా..? క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలంటే వారికి నచ్చిన ఆటలో ఆసక్తి, అంకితభావం, తపన ఎంత అవసరమో శిక్షణ కూడా అంతే ముఖ్యం. శిక్షణ అందుకోవాలంటే అందుకు తగ్గట్టు శరీరసష్టవం అవసరం. కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడల్లో పేదింటి పిల్లలు రాణిస్తున్నారు. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా క్రీడల్లో కఠోర సాధన చేస్తుంటారు. ఇటువంటి వారికి పౌష్టికాహారం నిమిత్తం ప్రతీనెలా కొంత నగదు బ్యాంకు ఖాతాల్లో వేసి, వారిని ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డే బోర్డర్స్ పేరుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అక్కరకు రావడంలేదు. ఇదీ పరిస్థితి... డే బోర్డర్స్ పథకంలో 13 క్రీడాంశాలుంటాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా అంశాల్లో క్రీడాకారులను ఎంపిక చేయాలి. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాటరీ, మోటార్ ఎబిలిటీ, ప్రతిభ పరీక్షల ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేస్తారు. శాప్ నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఎంపికలు నిర్వహిస్తారు. విద్యలకు నిలయమైన విజయనగరం జిల్లాలో ప్రస్తుతానికి స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మాత్రమే ఎంపికలు పూర్తి చేశారు. డే బోర్డర్స్ పథకం వర్తింప చేయకపోవడంపై వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతున్న అర్హులైన క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంతో పాటు వీరికి అవసరమైన స్పోర్ట్స్ కిట్‌ను అందించి, బీమా అమలు చేయాలి. ఈ పథకంలో ఎంపికైన క్రీడాకారులకు శాప్ డీఎస్ఏ కోచ్‌లు, క్రీడా సంఘాలకు కోచ్‌లు, వ్యాయామ అధ్యాపకులు, ఫిజికల్ లిట్రసీ ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తారు. శిక్షణ సజావుగా అందిస్తున్నా అర్హులైన నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందడం లేదు. ఎంపిక ఇలా.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో 12 నుంచి 15 ఏళ్లు, జూనియర్ విభాగంలో 16 నుంచి 19 ఏళ్లు, సీనియర్స్ విభాగంలో 19 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ పథకానికి అర్హులు. క్రీడాకారులు పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో జాతీయస్థాయిలో చూపిన ప్రతిభ, యూనివర్సిటీ, ఇంటర్ వర్సిటీ స్థాయిలో ప్రతిభ కొలమానంగా తీసుకుంటారు. ఎంపికైన క్రీడాకారుల్లో సబ్ జూనియర్స్‌కు రూ.1,500, జూనియర్స్‌కు రూ.2,500, సీనియర్స్‌కు రూ.4,000 వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రతినెలా జమచేయాలి. కానీ అతి తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలినవారు నిరాదరణకు గురవుతున్నారు. త్వరలో ఎంపికలు డే బోర్డర్ స్కీంలో మొత్తం 13 క్రీడాంశాల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో సుమారు 50 మందికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్ కోచ్‌లు ఉన్న క్రీడాంశాలకే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇటీవల కాలంలో శాప్ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ కోచ్‌లను నియమించారు. దీంతో త్వరలో ఎంపికలు నిర్వహించి మిగిలిన క్రీడాంశాల్లోని క్రీడాకారులకు ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటాం.– అప్పలనాయుడు, డీఎస్ఏ చీఫ్ కోచ్ -
ఆర్థికసహాయ పథకాల్లో 60 శాతం సబ్సిడీ
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయ పథకాల్లో లబ్ధిదారులో గిరిజన ప్రాం తాలకు చెందిన వారికి 60 శాతం సబ్సిడీతో పాటు రూ.లక్ష వరకు మినహాయింపు ఇవ్వనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయ్లక్ష్మి తెలిపారు. శనివారం ఆమె రాష్ట్రంలోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో హైదరాబాద్ నుం చి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయ పథకాలను పూర్తిస్థాయిలో అందించడానికి షెడ్యూ ల్డు తెగల లబ్ధిదారుల ఎంపికలో నైపుణ్యత చూపించాలన్నారు. జీవో నంబర్ 101 ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.120 కోట్లతో అన్ని రకాల అర్హతలున్న దా దాపు 60 వేల మందికి సంక్షేమ పథకాలు అం దించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. సంక్షే మ పథకాలు అందించడానికి గిరిజన తెగల్లో 21 నుంచి 45 ఏళ్ల వయోపరిమితి, పీటీజీలకు ప్ర త్యేకంగా 50 ఏళ్ల వరకు వయసు నిర్ణయించిన ట్లు పేర్కొన్నారు. ఐటీడీఏల పరిధిలో ప్రతి కు టుంబంలో ఒకరికే ప్రభుత్వ పథకాలు అందించనున్నట్లు చెప్పారు. మరలా ఆ కుంటుంబానికి ఐదేళ్ల వరకు సంక్షేమ పథకాలు అందవని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఈ నెల 21లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని రకాల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపాలని సూచించారు. అనంతరం పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, ఎంపిక, రెన్యూవల్ తదితర అంశాలపై సమీక్షించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఏవో భీం, వివిద విభాగాల అధికారులు పాల్గొన్నారు.