
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు ఫీజులను నిర్ణయిస్తూ మంగళవారం జీవో 54ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలో పేర్కొన్న మేరకు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలు నిర్ణీత ఫీజులను మాత్రమే వసూలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment